పవన్ కళ్యాణ్ ఒక విషయం స్పష్టంగా ఆలోచించాలి. జగన్ అనుకున్నది జరగనివ్వను, అలాగే అభిమానులు అనుకుంటుంది జరిగేలా చేస్తాను అని అంటున్న పవన్ కళ్యాణ్ ఆలోచనలో ఒక స్పష్టత రావాలి. జగన్ అనుకున్నది జరగనివ్వను అంటే జగన్ అయితే తెలుగుదేశం గెలవకూడదు అనుకుంటారు. జనసేన కూడా గెలవకూడదు అనుకుంటారు. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశంతో జనసేన  కలవకూడదని  కోరుకుంటారు. అంటే జగన్ ఆలోచన ఇలా ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా కలుస్తాము, గెలుస్తాము అని ఆయన చెప్పినట్టా అని కొందరి అభిప్రాయం.


ఇంకొకటి అభిమానులు అనుకున్నదే జరిగేలా చేస్తానంటే అభిమానులైతే పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే తెలుగుదేశంతో కాకుండా విడిగా పోటీ చేయాలి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేయండి అని అప్పటికే జనసేన బిజెపిని పక్కన పెట్టిన ఎఫెక్ట్ తో తెలుగుదేశం ఈ ఎలక్షన్లలో గెలిచింది.


ఈ ఎలక్షన్లలో జనసేన పోటీలోనే లేదు. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కలిసి వచ్చిన అంశమే. ఈ ఇంపాక్ట్ తో గెలిచిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ధైర్యంగా ఉంది. ఆ ధైర్యంతో ఇప్పుడు జనసేన అడిగేది ఇవ్వదు. ఆయన అభిమానులు అడిగినట్టు 78 అసెంబ్లీ సీట్లు ఇంకా పార్లమెంటులో సగం సీట్లు అనే వాటిలో, తెలుగుదేశం జనసేనకు అసలు అసెంబ్లీ కాదు కదా, పార్లమెంటులో రెండు మూడు సీట్లు ఇవ్వడం కూడా కష్టమే అని తెలుస్తుంది.


కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా స్పష్టత తెచ్చుకుని తెలుగుదేశం నుండి ఇప్పటికిప్పుడు విడిపోయి తన వారాహి రథం పై ప్రచారానికి వెళ్లడం మంచిదని చాలామంది అభిప్రాయం. ఒక పక్కన తెలుగుదేశానికి లోకేష్ పాదయాత్ర ఒక ప్లస్ అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ మరొక ప్లస్, వాటికి తోడు చంద్రబాబు రాజకీయ చతురత ఎలానూ ఉంటుంది. కాబట్టి వీటికి అనుగుణంగా ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ ఆలోచనలో మార్పు రావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: