భారతదేశం చైనా విషయంలో గడుసుతనాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తుంది. అరుణాచల ప్రదేశ్ తనది అంటుంది చైనా. తవాంగ్ కూడా తనదే అంటుంది చైనా. మొన్న అది అరుణాచల్ ప్రదేశ్ ని ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున సైన్యం మోహరించి ఆపడం అయితే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అరుణాచల్ ప్రదేశ్ తనదేనని గట్టిగా అంటుంది చైనా. గతంలో మన్మోహన్ సింగ్ విమానం కూడా అక్కడ వరకు వెళ్లి వచ్చేసింది వెనక్కి.


అందుకనే భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఇంకా అమిత్ షా పదేపదే వెళుతుంటారు అరుణాచల్ ప్రదేశ్ కి. అక్కడే భారతదేశం జీ20 సదస్సును కూడా నిర్వహించింది గతంలో. అరుణాచల్ ప్రదేశ్ ని భారత దేశంలో భాగం కాదు అని అన్నందుకే అరుణాచల్ ప్రదేశ్ లో జీ20 సదస్సును కావాలనే నిర్వహించింది భారత్. తవాంగ్ లో కూడా ఇదే కారణంతోనే పెట్టిందని తెలుస్తుంది.


భారతదేశం తన గడుసు తనాన్ని ఈ విధంగా ఈ పద్ధతిలో చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రాంతాల్లో జీ20 సదస్సు పెడితే చైనా కూడా చచ్చినట్లు ఆ కార్యక్రమానికి రావాల్సి ఉంటుంది. జి 20 సమావేశం అంటే చైనా ఏంటి, అన్ని దేశాలు కూడా రావాల్సి ఉంటుంది. ఒకవేళ చైనా అక్కడికి వస్తే భారత్ లో పెట్టిన సమావేశం కాబట్టి భారత్ కు వచ్చారని గట్టిగా చెప్పడానికి ఉంటుంది ఒకవేళ చైనా కనుక క్లైమ్ చేస్తే.


చైనా క్లైమ్ చేస్తే కనుక మన భారత దేశం అక్కడికి, జీ ట్వంటీ సమావేశానికి వచ్చిన మిగిలిన దేశాలను అన్నిటిని మీరందరూ వచ్చారు కదయ్యా సమావేశానికి అది భారత్ భూభాగం కాబట్టే కదా వచ్చారు అని అడగడానికి ఉంటుంది. అదే మరి భారతదేశం యొక్క గడుసుతనం. మామూలుగానే పక్క దేశాలపై కుట్రలకు ప్లాన్స్ వేసే చైనా, భారతదేశం యొక్క ఈ గడుసుతనాన్ని గమనించి అరుణాచల్ ప్రదేశ్ లో జరగబోయే జీ ట్వంటీ సదస్సుకు తాను రానని చెప్పేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: