చంద్రబాబు కైనా, చంద్రశేఖర రావు కైనా ఒక ఫార్ములా ఉంది. వాళ్లను విభేధించే వాళ్ళని పదేపదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. కేసీఆర్ చూస్తే టీఎస్ లేదా కేకే లేకపోతే ఎర్రబెల్లి ఇట్లాంటి వాళ్ళు  చాలా మందిని గురించి ఆయన చాలా మాట్లాడుకున్నారట. వాళ్ళు రాజకీయం లోకి వచ్చిన తర్వాత మన మనుషులు అన్నటువంటి కోణంలోకి వచ్చేసారట.


చంద్రబాబు నాయుడు అంటే బాగా అపారమైన అభిమానం ఉండే సీనియర్ జర్నలిస్టులో కొంత మంది, వాళ్ళ జర్నలిస్టులు కాబట్టి భుజం మీద చేయేస్తారు అక్కడితో అయిపోతుంది. పాపం వాళ్లు చానల్స్ పెట్టుకుంటే కనీసం మాత్రం అండ ఉండదు. రోజుకొక ఎమ్మెల్యే క్యాండిట్ నో లేదా ఎంపీ కాండిట్ నో పట్టుకొచ్చి మరి ఆయన చేత ఓకే చేయించుకునే వ్యక్తికి మాత్రం అపారమైన ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన అడిగిందల్లా ఇవ్వడం. ఇలాగా ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది.


 జనసేనను మొన్నటిదాకా వెంట రావాలనుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలిచేసరికి జనసేన ఊసే ఎత్తడం లేదు. ఎందుకంటే దగ్గరకు వచ్చాక ఇక ఎక్కడికి పోతారు అన్న కాన్సెప్ట్ తో ఉన్నారు. జనసేన గ్యారెంటీగా రావాలి లేకపోతే కనుక అవతల పక్కకు వెళ్ళినా కూడా అప్పటికి ఈ ఓటర్ మైండ్ సెట్ మార్చేసుకున్నాం కాబట్టి మనకు ఇది పెద్ద సమస్య కాదని ఒక కోణం.


ఎందుకంటే మొన్న హైదరాబాద్లో జరిగిన సభలో జనసేన ప్రస్తావన ఏమీ లేదు. అంతకుముందు ప్రతి మీటింగ్ లోను జనసేన ప్రస్తావన ఉండేది. ఇక తనతో రానంటున్న బిజెపిని పొగడ్తారు. నరేంద్ర మోడీని సభ వేదికపై నుండి ఆయనకు అద్భుతమైన విజన్ ఉందని పొగడ్తారు. మరో పక్కన కెసిఆర్ని పొగుడుతారు. నా టైంలో బిగిన్ చేసినటువంటి వాటిని రాజశేఖర్ రెడ్డి ఇంకా కెసిఆర్ కంటిన్యూ చేశారు అని వాళ్లను పొగుడుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే వీళ్ళందరూ కావాలి ఒక్క జగన్ కి వ్యతిరేకంగా వీళ్ళందరూ కలవాలి అని‌.

మరింత సమాచారం తెలుసుకోండి: