దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంతో బతికేస్తున్నాయి. శ్రీలంక మనం పెట్టిన సంతకంతో  బ్రతుకు ఈడుస్తుంది. చైనా దగ్గర అప్పు తీసుకుని డోక్లాంని తాకట్టు పెట్టి మనకే జెల్ల కొట్టింది. పాకిస్తాన్ రోజూ ఐఎంఎఫ్ చుట్టూ అప్పు కోసం తిరుగుతుంది. ఒక పక్కన సౌదీ అరేబియా దగ్గర, ఒక పక్కన వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని, చైనా ఇచ్చిన అప్పుతో బ్రతుకు ఈడుస్తుంది. మరోవైపు నేపాల్ చైనా వారి దగ్గర తీసుకున్న అప్పుతో బతికేస్తూ, మన దగ్గర తీసుకున్న నిధులతో బతికేస్తుంది.


మరోవైపు మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో మెయిన్ పరిశ్రమ దెబ్బతింది. ధరల సంక్షోభం పెరిగింది. ప్రజల్లో ఆగ్రహావేశాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో మరో శ్రీలంక, పాకిస్తాన్ కాకుండా ముందు జాగ్రత్తగా ఐఎంఎఫ్ ను బెయిల్ అవుట్ ప్యాకేజ్ అడిగింది. అది కూడా ఇవ్వడానికి రెడీ అయింది. కానీ అది ప్రస్తుత సంక్షోభాన్ని  అధిగమించడానికి అయితే ఉపయోగపడుతుంది కానీ ఇతర ఖర్చులకు వాడితే గనుక బంగ్లాదేశ్ పరిస్థితి మరింత దిగజారిపోతుంది.


అందుకోసం బంగ్లాదేశ్ ఖర్చులు తగ్గించుకుంటుంది. రాబోయే కాలంలో ఎన్నికలు వస్తుండడంతో వాటికి ఈవీఎంలు  కావాలి, ఇండియా దగ్గర కొనాలి, తయారు చేయించుకోవాలి. ముందుగా ఒక బడ్జెట్ అనుకొన్నా, ఎప్పుడో ఆ ఆలోచన మానుకుంది. బ్యాలెట్ పద్ధతి ద్వారానే అక్కడ ఎలక్షన్స్ జరిగేలా ప్లాన్ చేస్తుంది ఇప్పుడు అది. ఎందుకంటే డబ్బులు లేక ఈవీఎంలను పక్కన పెట్టేసిన పరిస్థితి అక్కడ.


వచ్చే పార్లమెంటరీ ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించకూడదని బంగ్లాదేశ్ ఎలక్షన్ కమిషన్ ఈ.సీ నిర్ణయించింది. ఆ దేశంలో ఈవీఎం లు  తనిఖీ చేయబడిన చరిత్రను కలిగి ఉన్నాయి. వాటిని వదులుకోవాలనే నిర్ణయం ఆర్థిక ఒత్తిడి నుండి వచ్చింది. ఈవీఎంలు లేకపోతే గనుక సంక్షోభం ఉంటుందని తెలుసు కానీ గత్యంతరం లేదు దానికి. డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో తీసుకుంటున్న నిర్ణయం అది అని తెలుస్తుంది. ఆదాయం లేదు కాబట్టి అవసరాలు తగ్గించుకుంటుంది బంగ్లాదేశ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

EVM