
కేసీఆర్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు రాలేదని.. ఇంతకంటే పెద్ద పని ఏముందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎందుకు ఉండాలి అని అడుగుతున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రభుత్వ పరంగా ప్రధానిని ఆహ్వానించారని.. వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవం లో పాల్గొన్నారని.. ఆయన్ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ కి తాను ప్రధాని, కేటీఆర్ సీఎం ఎలా అవ్వాలన్న ఆలోచన మాత్రమే ఉందని..తెలంగాణా అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రికి ఆలోచన లేదని.. ఈరోజు వరకు రీజనల్ రింగ్ రోడ్ ప్రారంభం కాకపోవడానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని... భూసేకరణ కు సహకరించనందుకే ఆగిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు ఓటు వేసినందుకు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ముఖ్యమంత్రి బాధ్యతా రహితంగా వ్యవహరించారన్నారు.
ఇందుకోసం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని.. పొద్దున్నే లేచి డైనింగ్ టేబుల్ వద్ద తెలంగాణ ను ఎలా దోచుకోవాలి అని మాత్రమే ఆలోచన చేస్తారని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. దేశంలో వంద వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తానని ప్రధాని చెప్పారని.. ప్రధాని ఫామ్ హోస్ లో ఉండరు.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని.. అహంకార నిర్లక్ష్య, కుటుంబ పాలనకి చెరమగీతం పాడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ ప్రజలను కేసీఆర్ అవమానిస్తున్నారన్నారు.