చిలకలూరిపేట కమ్మ సామాజిక వర్గం బలమైన ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి ఏరియా.. ఒక రకంగా చెప్పాలంటే పవర్ఫుల్ సీట్ అది. అక్కడ ఓట్ల సంఖ్య పరంగా తక్కువే అయినా, శక్తివంతమైన నియోజకవర్గం అది, విడుదల రజిని అక్కడే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. వాస్తవంగా బీసీలకు ఇవ్వడం జరగదు అక్కడ, కానీ అక్కడ ఇచ్చారు. ఇదివరకు పత్తిపాటి పుల్లారావు పోటీ చేసి గెలిచినటువంటి సీటు. తర్వాత ఓటమి పాలైన పరిస్థితి. విడుదల రజనీ ఏకంగా మంత్రి కూడా అయ్యారు ఇప్పుడు, బీసీ సామాజిక వర్గం నుండి అంత ఉన్నతమైన స్థానం లభించింది ఆవిడకు.


అక్కడ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సాలిడ్ ఓటింగ్ అనేది ఆవిడకు పనికి వచ్చింది. ఆవిడ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి బీసీల్లో ఒక సెక్షన్ కూడా ఆవిడకి ఓటేశారు. ఇక అక్కడ పత్తిపాటి పుల్లారావు మళ్లీ పోటీ చేయడానికి 25 నుండి 30 కోట్లు పెడితే మరొక ఎన్నారై 75 నుండి 80 కోట్ల వరకు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయనను నారా లోకేష్ ప్రోత్సహిస్తున్నట్టుగా  తెలుస్తుంది. అయితే అకస్మాత్తుగా  నందమూరి సుహాసిని పేరు తెరపైకి వచ్చింది.


కూకట్ పల్లికి చెందిన చుండ్రు కుటుంబానికి కోడలు నందమూరి సుహాసిని. హరికృష్ణ కుమార్తె అయిన ఈవిడని ఇప్పుడు నందమూరి అనే ట్యాగ్ తోనే పిలుస్తున్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి కూతురు బ్రాహ్మణి, నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ ని పెళ్లి చేసుకుంటే నారా బ్రాహ్మణి అయింది. కానీ నందమూరి హరికృష్ణ గారి కూతురు సుహాసిని, చుండ్రు శ్రీహరి గారి కొడుకు ని పెళ్లి చేసుకుంటే మాత్రం నందమూరి సుహాసిని గానే పిలవబడుతుంది. ఇది ఒక విచిత్రం. అయితే నందమూరి సుహాసినీని ఇక్కడ అభ్యర్థిగా పెడతారని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం అంత నమ్మదగ్గదీకాదు. ఎందుకంటే గెలవడం అనేది  కొత్త వాళ్ళకు అక్కడ అంత ఈజీ  కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: