పాక్ లో సైనిక పాలన వచ్చే అవకాశం ఉంది. పాక్ సుప్రీంకోర్టు అక్కడి పంజాబ్ లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. కానీ సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయబోమని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాద్ షరీఫ్ చెబుతున్నారు. అక్కడ ఇమ్రాన్ ఖాన్ కు పట్టుంది. ఆ ప్రాంతలో పాక్ ప్రభుత్వానికి సంబంధించిన షాబాద్ షరీఫ్ కొడుకుకు పట్టు లేదు. తక్కువ స్థానాల్లో గెలిచారు. అందుకే కోర్టు ఎన్నికలు పెట్టాలని తీర్పు ఇచ్చింది. దీనికి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు.


షాబాద్ షరీప్ కొడుకు బల నిరూపణలో ఓడిపోయారు. ఆ ప్రాంతంలో అస్థిరత నెలకొంది.  ఎన్నికలు నిర్వహించమని కోర్టు చెబితే అక్కడ ఎన్నికలు నిర్వహించమని ప్రభుత్వం  డైరెక్టుగా చెప్పేసింది. ఆ ప్రాంతంలో సైనికాధికారులతో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించింది.


నేషనల్ సెక్యూరిటీ కమిటీ పేరుతో ఆర్మీ జనరల్ ఆసిప్ మునీర్, జనరల్ షంజాద్ మీర్జా లాంటి వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం పాక్ పంజాబ్ ప్రాంతంలో ఆర్మీ ఆధీనంలోకి రానుంది. ఎందుకంటే షాబాద్ షరీప్ నాయకత్వంలోని ప్రభుత్వానికి ఆర్మీ అండగా ఉంటోంది. ఆర్మీని ఆ ప్రాంతంలో మోహరించి ఎన్నికలు జరగకుండా చేసి ఎమర్జేనీ పాలనను తీసుకొచ్చేలా పాక్ ప్రధాని షాబాద్ షరీఫ్ ప్రయత్నాలు చేస్తున్నారు. టర్కీ, మయన్మార్ లాంటి దేశాల్లో కూడా  ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.


ప్రస్తుతం పాక్ లో సైనికుల చేతుల్లోకి అధికారాలు వెళ్లేలా ఉన్నాయి. గతంలో కూడా పాక్ ఆర్మీ జనరల్ ముషారప్ పాకిస్థాన్ కు అధ్యక్షుడిగా చేశారు. పాక్ లో ప్రభుత్వం కంటే బలంగా సైన్యం ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే ఆకలితో ప్రజలు అలమటిస్తున్నారు. అప్పులు పెరిగిపోయాయి. ఆర్థిక పరంగా పాకిస్తాన్ తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. ఇలాంటి సమయంలో సైనిక పాలన అంటే రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఇదే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: