చిన్న వయసులోనే ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి వెళ్లి, ఆ తర్వాత కాంగ్రెస్ లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేసి ఆ తర్వాత పి.సి.సి అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజకీయాన్ని చాలా సులభంగా అవపోసన పట్టేశారు. నవ్వుతూ ఎదుటివారిని ఎలా ఇది చేయాలో చూపెట్టారు. ఉత్తమ్ కుమార్ నుండి అందరి ఆధిపత్యాన్ని తీసేసి రాహుల్ ని తన చేతిలో పెట్టుకోవడం మాత్రమే కాదు, సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తూ తనకు ఎదురు లేకుండా చేసుకోగలిగారు.


ఒక కే.కే ద్వారా కేసీఆర్ వేస్తున్న వ్యూహాన్ని రేవంత్ రెడ్డి మాత్రమే అడ్డుకోగలుగుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా అడ్డుపడగలుగుతున్నారు. బిఆర్ఎస్ కు పరోక్షంగా సహకరించే వాళ్ళని, లేదా తనను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని తొక్కిపడేయడానికి ప్రిపేర్ అవుతున్నారట ఆయన. అందులో మహేశ్వర్ రెడ్డి, ఆయన కూడా పి.సి.సి లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్న ఆయన తరచుగా ఈ మధ్యన రేవంత్ రెడ్డితో సీనియర్లకు గొడవలు వచ్చినప్పుడు మధ్యవర్తిత్వం చేయడం, లేదా రేవంత్ రెడ్డిని కూడా విమర్శించడం, ఇలా వీళ్ళను కూడా విమర్శిస్తున్న మహేశ్వర్ రెడ్డికి అకస్మాత్తుగా షోకాజ్ నోటీసులు ఇచ్చారు.


కారణం ఏంటంటే ఆయన ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. పార్టీకి వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నిస్తున్నాడు. భారతీయ జనతా పార్టీతో సన్నిహితంగా ఉంటున్నాడు అనేటువంటి పాయింట్ పైన. తన జోలికి వస్తే ఏమైనా చేయగలను అన్నటువంటి కాన్సెప్ట్ తో పాటు కాంగ్రెస్ పార్టీ పై పూర్తి ఆధిపత్యం తాను సాధించగలుగుతున్నారు రేవంత్. చివరకు రేవంత్ దెబ్బకు మహేశ్వర్‌ రెడ్డి బీజేపీలో చేరిపోయారు.


ఎదుటి పార్టీలోకి తనవాళ్లు ఎవరు వెళుతున్నారో వాళ్ళ పై ఒక కన్నేసి ఉంచగలుగుతున్నాను అని అధిష్టానానికి కూడా స్పష్టంగా చెప్పగలుగుతున్నారు రేవంత్ రెడ్డి. ఈ రకంగా పార్టీలో తెర వెనక జరిగే విషయాలపై కూడా ఒక కన్నేసి ఉంచి తాను ఉన్న , పార్టీని తగ్గనీకుండా, పార్టీకి ఎటువంటి నష్టం రానీయకుండా ఎంతో చాకచక్యంగా చేసుకుంటూ వెళ్తున్నారు రేవంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: