వన్ రోడ్ వన్ బెల్డ్ అనే నినాదంతో చైనా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం చేసి తన మార్కును చూపించాలనుకుంది. దీని కోసం గతంలోనే విశ్వ ప్రయత్నాలు చేసింది. అయితే భారత్ ఈ విషయంలో అస్సలు అంగీకరించలేదు. పరాయి దేశం వచ్చి మన దేశంలో రోడ్లు వేసుకుని తమ వ్యాపారాలను ఇక్కడ కొనసాగించుకుంటామంటే కుదరదని తెగేసి చెప్పింది.


దీంతో చైనా పాకిస్థాన్, అప్గానిస్థాన్ లాంటి దేశాల నుంచి వన్ రోడ్ వన బెల్ట్ రోడ్ ను ప్రారంభించింది. ప్రపంచం కుగ్రామంగా దానికి చైనా అధిపతిగా నిలవాలని కోరుకుంది. అయితే చైనా ఒక విషయాన్ని మరిచిపోయింది. రోడ్డు ద్వారా చేసే ట్రాన్స్ పోర్టకు ఎక్కువ ఖర్చవుతుంది. అదే సముద్ర జలాల నుంచి షిప్పుల ద్వారా చేసే ట్రాన్స్ పోర్టకు తక్కువ ఖర్చవుతుంది.


దీన్ని మరిచి ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని నిరూపించేందుకు వన్ రోడ్ వన్ బెల్ట్ అనే నినాదాన్ని తీసుకొచ్చింది. అయితే రోడ్డు ట్రాన్స్ పోర్టేషన్ విధానంలో రైళ్లు పెట్టుకుంటే మంచిది. అయితే చైనా పాకిస్థాన్, అప్గాన్ నుంచి ఇరాన్, రష్యా వరకు వెళ్లాలంటే ఎక్కడిక్కడ గొడవలు జరుగుతున్నాయి. స్థానికంగా అక్కడున్న పరిస్థితులు అస్సలు అనుకూలించడం లేదు. లక్షల కోట్లు పెట్టి చేసిన ఖర్చు కూడా చిల్లిగవ్వ ఆదాయం రాని విధంగా తయారవుతోంది.


అయితే ఈ వన్ రోడ్ వన్ బెల్ట్ విధానంలో ఎక్కడ బ్రేక్ పడ్డ మొత్తం రవాణా వ్యవస్థ ఆగిపోతుంది. పాకిస్థాన్, అప్గానిస్థాన్ లాంటి దేశాలను పెట్టుకుని విజయవంతంగా వ్యాపారం చేయాలనుకోవడం చైనా చేస్తున్న పొరపాటు. అయితే చైనా మాత్రం తెలివిగా ఆలోచించి పీవోకే భారత్ కు ఇప్పించేలా చేసి తన వ్యాపారాన్ని కొనసాగిస్తే వన్ రోడ్డ వన్ బెల్ట్ కు చాలా ఈజీ అవుతోంది. మరి ఇలాంటి పరిస్థితిలో చైనా ఈ విషయం నుంచి ఎలా బయటపడాలో ముందుకెళ్లేలేదు, వెనక్కి రాలేని పరిస్థితుల్లో దారుణంగా తయారైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: