
కానీ అమిత్ షా తాను వచ్చాక ఉగ్రవాదాన్ని మూలల లోకి వెళ్లి మరీ తుద ముట్టిస్తున్నారు. ఇంకా టెర్రరిజాన్ని అసలు సహించట్లేదు. కాబట్టి ఆ రెండు వర్గాలు అమిత్ షా ని ఏదో ఒకటి చేయాలనే కసితో ఉన్నారని తెలుస్తుంది. తాజాగా ఉగ్రవాదులు ఇంకా నక్సలైట్ల ప్రభావం ఎక్కువ ఉన్న బెంగాల్ లో, ప్రత్యేకంగా అమిత్ షా గెలుపు కోసం కాన్సన్ట్రేషన్ చేసిన సందర్భంగా అక్కడ కీలకమైన పరిణామం చేసుకుంటుంది.
అక్కడ అమిత్ షా ని టార్గెట్ చేస్తూ, ఆయన పర్యటించే ప్రాంతంలో 2రోజులుగా ఒక స్కార్పియో వెహికల్ ఉండడం సంచలనం అయింది. ఇప్పుడు బీర్బూం జిల్లాలోని, గుస్లారా బైపాస్ సమీపంలో ఒక స్కార్పియో అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాధానం ఇచ్చారు. పోలీసుల తనిఖీలో 17 బాక్సులు కనిపించాయి. వాటిని తెరిచి చూస్తే 200వరకు జెలిటిన్ స్టిక్స్ ఉండడంతో పోలీసులు బాంబు స్క్వాడ్ ని పిలిపించి వాటిని నిర్వీర్యం చేశారు.
గత ఏడాది కూడా ఇక్కడే ఓ పికప్ వ్యాన్లో 81 వేల డిక్టేటర్లు లను పోలీసులు గుర్తించారు. ఆ కేసులో అప్పుడు ముగ్గురిని అరెస్టు చేశారు. సాధారణంగా జెలిటిన్ స్టిక్స్ లాంటి వాటిని కొండల్ని పేల్చడానికి వాడుతూ ఉంటారు. మరి ఈ లభ్యమైనవి అలాంటివా లేదా, అమిత్ షా కోసమే టార్గెట్ చేసినవా అనేది పోలీసులు ఏమి తేల్చలేదు. కానీ ఏమీ చెప్పక పోవడంలోనే ఇది అమిత్ షా కోసమే అనే పాయింట్ చర్చల్లోకి వస్తుంది.