ఉత్తరప్రదేశ్ లో అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, అంతకుముందు గ్యాంగ్ స్టర్ గా ఎన్నో హత్యలు చేసి వందలకు పైగా కేసులు ఉన్న వ్యక్తి అతీక్ అహ్మద్. అయితే ఇతన్ని ఇటీవల దారుణంగా హత్య చేశారు. ప్రయాగ్ రాజ్ కోర్టు నుంచి హాస్పిటల్ కు హెల్త్ చెకప్ కు తీసుకువచ్చే సమయంలో ముగ్గురు యువకులు కాల్చి చంపారు. దీనిపై కొంతమంది చట్టాలకు వ్యతిరేకంగా చంపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు అతీక్ ముస్లిం అయినందుకే ఎన్ కౌంటర్ చేశారని విమర్శలు చేస్తున్నారు.


కానీ ఇక్కడ అతీక్ అహ్మద్ చేసిన అరాచకాలను వారు చూడటం లేదు. ఉత్తరప్రదేశ్ లో రెండు మూడు దశాబ్దాల పాటు అతీక్ అహ్మద్ ఏదీ చెప్తే అది జరిగేది. ఎలాంటి ప్రాంతంలోనైనా అతీక్ ఆధిపత్యం కొనసాగేది. ఎంతలా అంటే ఒక వ్యక్తి అతీక్ అహ్మద్ దగ్గరకు వచ్చి నాకు పలానా ప్రాంతంలో ఉన్న ఆ షాపు కావాలని అడిగితే ఆ షాపు ఓనర్ ను పిలిచి ఇచ్చేయమని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆ షాపు ఓనర్ దానికి ఒప్పుకోలేదు. 30, 40 ఏళ్ల నుంచి షాపు నడిపిస్తున్నాం. ఇవ్వలేమని ప్రాధేయపడ్డారు. అతీక్ మాటను కాదంటారా అని నడిరోడ్డుపై వారిని నరికి వేయించారు. దీనిపై పోలీస్ స్టేషన్ లో అతీక్ పై కేసు నమోదు  చేయడానికి పోలీసులు భయపడ్డారని తెలుస్తోంది.


చివరకి ఆ వ్యక్తి కరెంట్ తీగలు తగిలి యాక్సిడెంట్ లో చనిపోయాడని కేసు నమోదు చేశారు. 12 మంది జడ్జిలు సైతం అతీక్ కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలంటే భయపడిన సందర్భం వచ్చిందంటే ఎంతటి దారుణాలకు ఒడిగట్టాడో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అతీక్ వ్యక్తి ముస్లిం, దూబె అనే వ్యక్తి హిందూ ఇలా చూడకుండా దారుణాలు చేసిన వారందరూ ఉత్తరప్రదేశ్ లో ఎన్ కౌంటర్ అవుతున్నారని యూపీ ప్రజలు సంతోషిస్తున్నారు. ఇలాంటి చర్యలకు మతం అనే రంగు పూయకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: