పోలాండ్ మొన్న యుద్ధ విమానాలను, కోవిడ్జర్ యుద్ధ ట్యాంకులను పెద్ద ఎత్తున సప్లై చేసింది ఉక్రెయిన్‌కి. వాళ్లు పంపించినటువంటి కోవిడ్జర్ యుద్ద ట్యాంకులు అత్యంత పవర్ఫుల్ అయినటువంటివని, అలాంటివి రష్యా దగ్గర కూడా లేవని ప్రపంచాన్ని అంతటిని నమ్మించింది. పోలాండ్ లానే అమెరికా, యూరప్ దేశాలు కూడా చేశాయి. తీరా చూస్తే నిన్న ఒకటి పడిపోతే ఈరోజు ఒకటి పడిపోయినట్లుగా కూలతున్న సందర్భంలో ఈ ట్యాంకులు, వాస్తవంగా ఈ కోవిడ్జర్లు ఏమీ గొప్పవి కావని తేల్చేసింది రష్యన్ సైన్యం.


ఉక్రెయిన్‌లోని పాశ్చాత్య ఆయుధాలపై రష్యా నిరంతరం లక్ష్యంగా దాడి చేస్తోంది. లేటెస్ట్ డెవలప్మెంట్ లో భాగంగా మాస్కో దళాలు పోలాండ్ తయారు చేసిన క్రాబ్ హోవిట్జర్‌ని ప్రకటించాయి. రష్యా యూఏవి దళం జరిపిన ఖచ్చితమైన దాడిలో హోవిట్జర్ ధ్వంసమైంది.  


ఉక్రేనియన్ స్వీయ చోదక ఫిరంగి తుపాకీల స్థానాన్ని  యూఏవిలు గుర్తించాయి, ఆ తర్వాత రష్యా సిబ్బంది క్రాబ్ హోవిట్జర్ గన్‌పై దాడికి దిగారు, రష్యన్ డ్రోన్ ద్వారా మొదటి షార్ట్‌ను ధ్వంసం చేశారు.  2 రోజుల్లో ఉక్రెయిన్‌లో ధ్వంసమైన రెండవ పోలిష్ క్రాబ్ హోవిట్జర్ ఇది. ఇది ముందుగా డ్రోన్ లాంటి ఎక్విప్మెంట్ తో విజువలైజ్ చేస్తుంది. ఆ విజువల్స్ చేసినటువంటి రష్యన్ మిస్సైల్ కేర్ ఫుల్ గా నిర్దేశిత లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది.


అయితే ఒక మిస్సైల్ దెబ్బకి, అత్యంత శక్తివంతమైనవని చెప్తున్న కోవిడ్జర్ ట్యాంకులు కూలిపోతున్నాయి, సర్వనాశనం అయిపోతున్నాయి. ఇంతవరకు మిస్సైల్స్ కూడా వీటిని ఏమీ చేయలేవని ప్రచారం చేసిన వాళ్లు ఇలా కూలిపోవడంతో ఏమి మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. కానీ ఒక్క మిస్సైల్ దెబ్బకే పడిపోయిన విజువల్స్ ని కూడా రికార్డు చేసి రష్యా ప్రపంచానికి చూపెడుతుంది. వీళ్ళు ఇంత గొప్పలు చెప్పారు. ఇక్కడ మా దెబ్బకి ఇలా పడిపోతున్నాయి అని. మా దగ్గర ఇంత శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయని రష్యాని భయపెట్టాలని చూసినా అది భయపడడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: