లెక్కలు.. పిల్లలకు ఒక పట్టాన అర్థంకాని సబ్జక్టు ఇది. కానీ.. ఈ సబ్జక్టులో పర్‌ఫెక్ట్ అయితే ఫ్యూచర్‌కు ఢోకా ఉండదు. సహజంగా మన భారతీయులు ఈ లెక్కల్లో చాలా ఫాస్ట్‌గా ఉంటారు. అందువల్లే ఐటీ వంటి రంగాల్లో మనవాళ్లు దూసుకుపోతుంటారు.ఇప్పుడు ఇదే భయం బ్రిటన్‌ వాసులకు పట్టుకుందట. బ్రిటిష్ వారికి లెక్కలు రావడం లేదట. ఇదేవరో అనలేదు. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ఒక సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


అంతేకాదు బ్రిటిష్ ప్రజలకు లెక్కలు రాకపోవడంతో బ్రిటిష్ ఎకానమీ చాలా నష్టపోతుందని అన్నారు. బ్రిటిన్ పౌరులు లెక్కలంటే భయపతున్నారని, దీని వల్ల వ్యక్తిగతంగా, ఎకానమీ పరంగా నష్టపోతున్నట్లు చెప్పారు. ఎకానమీ కూడా వందల కోట్ల డాలర్లు నష్టపోతుంది కేవలం సరైన లెక్కలు రాకపోవవడం వల్లనే అని రిషి సునాక్ అన్నారు. ప్రతి బ్రిటిష్ పౌరుడికి లెక్కలు వచ్చేలా ఒక నిపుణుల బృందాన్ని నియమించారు. రిషి సునాక్ స్టాన్ పోర్డ్ యూనివర్సిటీలో చదివిన వ్యక్తి. కేవలం రాజకీయ నాయకుడిగా కాకుండా యూనివర్సీటీలో చదివిన విద్యావేత్తగా చెప్పారు.


జనరల్ సర్టిఫికెట్ సెకండరీ ఎడ్యుకేషన్ లో మ్యాథ్స్ ఎగ్జామ్ లో విద్యార్థులు మూడో వంతు మంది ఫెయిల్ అవుతున్నారు. దీన్ని అధిగమించాలని రిషి సునాక్ భావిస్తున్నారు. అలాగే బ్రిటిష్ వయోజనుల్లో దాదాపు 80 లక్షల మందికి కనీసం 9 వ తరగతి పిల్లవాడు చేసే మ్యాథ్స్ కూడా చేయలేక పోతున్నారని తెలుస్తోంది.


ఓఏసీడీ కంట్రీస్ లో ఇంత లోయేస్ట్ మ్యాథ్య్ అవగాహన ఉండటం బ్రిటిష్ వారికి ఎకానమీగా చాలా ఇబ్బంది కలుగుతోందని రిషి సునాక్ అభిప్రాయపడ్డారు. దీని నుంచి బ్రిటిషర్లను బయటపడేసి ప్రతి ఒక్కరు మ్యాథ్స్ నేర్చుకునేలా ప్రోత్సహించాలి. తద్వారా రాబోయే రోజుల్లో దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించేలా వారిని తయారు చేయాలని భావిస్తున్నారు. మరి రిషి సునాక్‌ కలలు ఫలిస్తాయా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: