టెక్నాలజీని ఎక్కువ ఉపయోగించడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. సైబర్ క్రైం పెరిగిపోతుంది. మీకు తెలియకుండానే మీ అకౌంట్ లో డబ్బులు పోతున్నాయి. ఏవో లింకులు పోన్లకు రావడం.. వాటిని క్లిక్ చేయగానే వెంటనే డబ్బులు మాయమైపోవడం. ఇలా ఎన్నో ఎన్నెన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. సైబర్ క్రైం విషయాల్లో దాదాపు లక్ష కేసులు ఉంటే కేవలం 100 కేసులుకు మాత్రమే న్యాయం చేయగల స్టాప్ ఉండటం ఇక్కడ ఇబ్బందికర విషయం.

 
ప్రస్తుతం ఆర్టిపిషీయల్ ఇంటిలిజెన్స్ చాలా ప్రమాదకరమైన టెక్నాలజీ.  ఒక వ్యక్తి ప్రమేయం లేకుండా ఆ మనిషి ఎలా మాట్లాడుతాడో, ఎలా పాటపాడతాడు.. ఏ విధంగా బొమ్మగీయగలడు అచ్చు గుద్దినట్లు చేయగలదు. దీని వల్ల రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. మార్పింగ్, క్లోనింగ్, వాయిస్, వీడియో, ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాలుగా ఆర్టిపిషీయల్ ఇంటిలిజెన్స్ తో జనరేట్ చేయొచ్చు.


రిక్ అనే పాప్ సింగర్ పాడినట్లు ది వీకెండ్ అనే పాట బయటకు వచ్చింది. కానీ అది ఆయన పాడిన పాట కాదు. దీంతో నివ్వెరపోవాల్సిన పరిస్థితి. ఒక ఫోటోగ్రాపర్ తీసిన చిత్రానికి అంతర్జాతీయంగా అవార్డు వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఆ ఫోటో ఆయన తీయనే లేడంట. కానీ అవార్డు ప్రకటించేశారు. తీరా చూస్తే ఆర్టిపిషీయల్ ఇంటిలిజెన్స్ కారణంగా తీసిన చిత్రమని తేలింది.


చాట్ జీపీటీ , బర్డ్, మిడ్ జర్నీ లాంటి వాటిలో జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఇమిటేట్ చేయడంలో ఆర్టిపిషీయల్ ఇంటిలిజెన్స్ తో ప్రమాదం అని ఫోటో గ్రాపర్ అన్నారు. అయితే లేజీ గా బతికే వారికి ఇది మంచి అవకాశమే. కానీ దీనితో అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. చేయని తప్పునకు శిక్ష అనుభవించాలి. ఎందుకంటే వాయిస్, వీడియో క్లోనింగ్ వల్ల జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఆర్టిపిషీయల్ ఇంటిలిజెన్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

AI