
కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయిదుగురు వీర సైనికులను కోల్పోయి పుట్టేడు దు:ఖంలో ఉన్న సమయంలో పాక్ విదేశాంగ మంత్రి ఇండియాలో పర్యటించడం ఎవరికీ కూడా ఏ మాత్రం ఇష్టం లేదు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ విషయంలో ఎంతో మంది సైనికులను పోగొట్టుకున్నాం. తెర వెనక కుట్ర పన్నుతున్న పాక్ కు చెందిన విదేశాంగ మంత్రిని ఇక్కడికి రానీయవద్దని మాజీ సైనికాధికారులు, రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు.
ఒక వైపు సైనికులను చంపడానికి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ వారికి డబ్బులు చేరవేస్తూ మరో వైపు మీటింగ్ లకు రావడం ఏమిటనే కోపంతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. గతంలో వాజ్ పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో పాకిస్థాన్ అధ్యక్షుడు ముషారప్ ఇండియాకు చివరిసారి వచ్చారు. కానీ పూర్తి పర్యటన గడపకుండానే ఒక రోజు అనంతరం తిరిగి వెళ్లిపోయారు. దానికి సరైన కారణాలు కూడాా చెప్పలేదు. మరి ప్రస్తుతం సైనికులు చనిపోయి దేశ ప్రజలు కోపంతో ఉన్న సమయంలో పాక్ విదేశాంగ మంత్రిని రానిస్తారా? లేక అడ్డుకుంటారా అనేది చూడాలి.