అమెరికా అధ్యక్షుడిగా ట్రంపు ఉన్న సమయంలో భారత్ తో మంచి సంబంధాలే కొనసాగించాడు. క్వాడ్ అనే దాన్ని పెట్టి అందులో భారత్ ను భాగస్వామిగా చేర్పించాడు. అనంతరం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంపు ఓడిపోయాడు. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  తర్వాత క్వాడ్ ను తీసేశాడు. భారత్ తో అంటి ముట్టనట్లు వ్యవహరించాడు.


రెండేళ్ల పాటు భారత్ లో అమెరికా దౌత్యవేత్తను నియమించలేడు. చాలా వరకు పాక్ తో సత్సంబంధాలు కొనసాగించడానికే ఆయన ప్రయత్నించారు.  ప్రస్తుతం జీ 20 సమావేశాలు భారత్ లో జరగనున్నాయి. దీని కోసం అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇండియాకు రానున్నారు.  గతంలో విదేశాల నుంచి వచ్చే వారు పాకిస్థాన్ కు వెళ్లి అక్కడ కాశ్మీర్ గురించి అవాకులు చెవాకులు పేలి ఇండియాకు వచ్చే వారు. అయినా వారిని సాదరంగా ఆహ్వానించి వారితో మాట్లాడి పంపించే వారు. ప్రధానిగా నరేంద్ర మోదీ గెలిచాక పంథా మార్చారు.


ఎవరైనా సరే ఇండియాకు వస్తే పాకిస్థాన్ వెళ్లొద్దు. ఒక వేళ పాకిస్థాన్ కు వెళ్లి ఇండియాకు రావాల్సిన అవసరం లేదని కరాఖండిగా చెప్పేశారు. ఏ దేశాధినేత అయినా నేరుగా ఇండియాకు రావచ్చు. వ్యాపార, వాణిజ్య సంబంధాలపై ఒప్పందాలు చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు కూడా భారత్ కు జీ 20 సదస్సు కోసం రానున్నాడు. మరి మోదీ విధించిన నిబంధనను పాటిస్తాడా లేదా అన్నది త్వరలో తేలనుంది.


బైడెన్ మాత్రం ఇప్పటికే పాక్ ను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేయడానికి చాలా వరకు సాయం చేస్తున్నాడు. గతంలో ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు చైనా తో ఎక్కువ సంబంధాలు పెట్టుకుని అమెరికాకు కొంచెం దూరంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఉన్న పాక్ ప్రధాని అమెరికానే పాక్ ను రక్షిస్తుందని ఆర్థికంగా బలంగా తయారు చేయడానికి దాన్ని మించిన దేశం లేదని భావిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: