ప్రపంచ వ్యాప్తంగా సెమీ కండక్ట్ చిప్స్ కు అత్యంత ఆదరణ ఉంది. కరోనా అనంతరం తగిలిన ఎదురు దెబ్బ. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అనంతరం జరుగుతున్న పరిణామాలతో భారత్ సెమీ కండక్ట్ చిప్స్ ను తయారు చేసే కంపెనీలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది. కంపెనీలకు మంచి రాయితీలు అందించి వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టింది.


కార్లు, బైక్ లు టూ వీలర్స్ ను టైం కు ఇవ్వలేకపోతున్నారు. జపాన్, తైవాన్, చైనా లాంటి దేశాల్లో ఉన్న సెమీ కండక్ట్ తయారు చేసే కంపెనీలకు భారత్ ఆహ్వనం పలుకుతోంది. భారత్ వ్యాపారాలు చేసుకోవడానికి అత్యంత అనువైన దేశంగా ఉందని ఆయా కంపెనీలకు చెబుతోంది.


పీఎల్ఐ స్కీమ్ ద్వారా పర్పార్మెన్స్ లింక్ డ్ ఇన్సెంటివ్ ను తీసుకొచ్చింది. ఇండియాకు వచ్చి పరిశ్రమ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం, భూమి చూపించడం, ఆ తర్వాత కంపెనీలో నుంచి ప్రొడక్టు తయారు చేసి దాని ద్వారా వచ్చే ఆదాయం తో ఇన్సెంటివ్ ను ఇవ్వాలని చెబుతోంది. దీంతో కంపెనీలు చాలా వరకు వచ్చి పని చేస్తున్నాయి. పీఎల్ఐ స్కీమ్ అనేది చాలా కంపెనీలకు నచ్చినట్లు కనిపిస్తోంది.


ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సెమీ కండక్ట్ ల వాటా 500 బిలియన్ డాలర్లుగా ఉన్న సమయంలో దాదాపు రూ.41 లక్షల కోట్ల రూపాయల సెమీ కండక్ట్ తయారీ రంగంలో ఇప్పటి వరకు భారత్ వాటా సున్నాగా ఉండేది. నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అంశమే. పీఎల్ ఐ స్కీమ్ ద్వారా కొత్తగా మైక్రాన్ అనే సంస్థ వెయ్యి మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.  ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని ప్రకటించింది. ఈ సెమీ కండక్ట్  చిప్స్  కొన్ని దేశాల్లో పరిమితంగా మాత్రమే తయారయ్యేవి. కాబట్టి వీటిని తయారు చేసే కంపెనీలను ప్రోత్సహించి ఈ రంగంలో కూడా ఇండియా రాణించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: