రష్యా దేశాన్ని ఆంక్షల చట్రంలో బంధించి  ఆర్థికంగా దెబ్బతీయాలని అమెరికా, యూరప్ దేశాలు భావించాయి. వివిధ ఆంక్షలను  రష్యాపై విధించాయి. ఈ విధంగానే ప్రపంచంలోని అన్ని దేశాలు రష్యాపై ఆంక్షలు పెట్టాలని కోరాయి. ముఖ్యంగా భారత్ ను పదే పదే ఈ విషయంలో ఒత్తిడి చేశాయి. రష్యా నుంచి ఆయిల్ ను ఎందుకు కొంటున్నారని నిలదీశాయి. జీ 20 సమావేశాల్లో కూడా రష్యాపై ఒత్తిడి తేవాలని భారత్ ను కోరాయి. దీనికి భారత్ ఒప్పుకోలేదు.


అసలు విషయం ఇప్పుడు బయటపడుతోంది. రష్యాపై విధించిన ఆంక్షలు కొన్ని మాత్రమేనని తెలుస్తోంది. రష్యా నుంచి యథేచ్ఛగా యూరప్ దేశాలు వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రాన్స్ యూరేనియంను కొనుగోలు చేస్తుంది. యుద్దం ప్రారంభమైన తర్వాత ప్రెంచ్ పోర్టుకు చేరిన యూరేనియం ప్రస్తుతం ఏడో షిప్పు అని తేలింది.


యూరేనియం కోసం కొన్ని మిలియన్ డాలర్లను రష్యా కు ప్రాన్స్ చెల్లించిందన్న మాట. మొత్తం యూరప్ దేశాలు యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా వద్ద 700 మిలియన్ డాలర్ల వ్యాపారం కొనసాగించాయని కొన్ని నివేదికలు బహిర్గతపరిచాయి. బ్రిటన్ అల్యూమినియం కొనుగోలు చేసి షేర్ మార్కెట్ లో దాని వ్యాల్యూను పెంచుకుందని తెలుస్తోంది.


అణు విద్యుత్ కర్మాగారాల విషయంలో రోజెటా అణు కర్మాగారం నుంచి దాదాపు 750 మిలియన్ డాలర్ల వ్యాపారం ఒప్పందాలు ఉన్నట్లు తెలుస్తోంది. అది రష్యా, ఉక్రెయిన్ యుద్దం ప్రారంభమైన ఏడాదిలోనే ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం కొనసాగినట్లు బయటపడింది. రష్యాపై విధించిన ఆంక్షల జాబితాలో అల్యూమినియం లేదని తెలుపుతున్నాయి. నికెల్, కాపర్, పెలోడియం మీద ఆంక్షలు లేవని చెబుతున్నాయి. నికెల్ కు 3.3 బిలియన్ డాలర్లు, కాపర్ కు 2. 6 బిలయన్  డాలర్లు, బంగారంపై పెద్ద ఎత్తున రష్యాతో వ్యాపారం కొనసాగిస్తున్నట్లు బయటపడింది. దీనిపై యూరప్ దేశాలపై వివిధ దేశాలు మండిపడుతున్నాయి. ఆంక్షలు మాకు వ్యాపారాలు మీకా అంటూ తిట్టిపోస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: