ప్రతి ఒక్కరికి తాము, కాదంటే తమ పిల్లలు అయినా జీవితంలో పెద్ద చదువు చదవాలని, గొప్పగా సెటిల్ అవ్వాలని కోరుకుంటుంటారు. దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే  ఏం చదివితే ఎటువంటి ఉద్యోగం వస్తుందనేది తెలియని కొంత మంది కోసం ప్రభుత్వాలు వాటిని ప్రచారం చేస్తుంటాయి. ఇప్పుడు పరిగెత్తే కాలంలో, ఈ పోటీ ప్రపంచంలో ఎటువంటి చదువులు చదివి, ఎటువంటి పరీక్షలు రాసి ముందుకు వెళ్లాలనేది ఇప్పుడు నిపుణులు చెప్తున్నారు. అవి ప్రపంచంలోనే 5 టఫ్ఫెస్ట్ పరీక్షలు అని చెప్తున్నారు.


వాటి వివరాల్లోకి వెళ్తే మొదటిది జిఆర్ఈ గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్.. ఇది యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర దేశాలలో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఉపయోగించే ప్రామాణిక పరీక్ష. ఇందులో పాస్ అయితే అమెరికా యూరప్ దేశాల్లో చదువుతోపాటు ఉద్యోగం కూడా దొరుకుతుంది కోట్ల రూపాయలలో, కోట్లలో సంపాదించే అవకాశం కుదురుతుంది. ఇది జిఆర్ఈకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం.


రెండవది గ్రాడ్యుయేట్ ఆటిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. దీన్నే సంక్షిప్తంగా గేట్ ఎగ్జామ్ అని పిలుస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సులు ఇంకా ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలలో ప్రవేశానికి భారతదేశంలో గేట్ నిర్వహించబడుతుంది. ఇది మన దగ్గర ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకి కీలకమైనటువంటి పరీక్షగా ముందు వరుసలో ఉంటుంది.


ఆ తర్వాత యుపిఎస్సి  సిఎస్ఈ-సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. భారతదేశంలో అత్యంత పోటీ పరీక్షలలో ఒకటిగా విస్తృతంగా ఇది పరిగణించబడుతుంది.  ఇది అడ్మినిస్ట్రేటివ్ మరియు ప్రభుత్వ సేవా ఉద్యోగాలు కోరుకునే వారి కోసం ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎఫ్, ఐసిఎస్  ఇట్లాంటి పరీక్షలకు సంబంధించి జెఈఈ భారతదేశంలో అత్యంత పోటీతత్వ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష. ఇది దాని సంక్లిష్ట సమస్య పరిష్కారం ఇంకా అధునాతన గణిత భావనలకు ప్రసిద్ధి చెందింది. జేఈఈ లో పాస్ అయితే కనుక కోట్లలో డబ్బులు ఇచ్చి భారత్ లోనే కాకుండా ప్రపంచమంతా తీసుకోవడానికి రెడీగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: