కమ్మలు, లేక రెడ్లు మాత్రమే సీఎం అవుతున్నారని కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు సీఎం పదవి చేపట్టలేకపోవడం ఆ వర్గానికి తీరని లోటుగా మిగిలిపోతుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడడానికి వారు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఎలాగైనా జనసేనను గెలిపించే ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిణామమే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో జరిగింది. ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 22 శాతం ఓట్లు లభించాయి. 18 ఎమ్మెల్యే స్థానాల్లో ఆయన పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ సీఎంగా మాత్రం గెలిపించుకోలేక పోయారు.


కాపు సామాజిక వర్గం ప్రస్తుత ఆలోచనలు ఏంటి.. గతంలో రంగను ఆదరించారు. తర్వాత చిరంజీవిని కూడా గెలిపించినా ఆయన సీఎం కాలేక పోయారు. . అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో చిరంజీవి ప్రజారాజ్యం  పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. మళ్లీ కాపు నాయకుల ముఖాలు వెలుగులీనడానికి కారణం పవన్ కల్యాణ్. ఎందుకంటే పవన్ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు. చిరంజీవి ఆనాడు కాపు నాయకుడిని అనే పదాలు వాడలేరు. కాపులందరూ కలిసి నిలబడాలని పవన్ కోరారు. కానీ ప్రస్తుతం చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ సిద్ధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం ప్రత్యర్థులుగా ఉండేవారు. అలాంటి వారు గత సారి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే బోల్తాపడ్డారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కమ్మ, కాపు వారు ఎన్నో ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎలా స్పందిస్తారనేది చూడాల్సిన అంశం. కమ్మ, కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు అందరూ కలిసి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. పవన్ నే సీఎంగా గెలిపించడానికి మొగ్గు చూపుతారా.. లేక సీనియర్ చంద్రబాబును గెలిపించడానికి ఒప్పుకుంటారా.. ఏదేమైనా ఆంధ్రలో కుల రాజకీయాల జోరు కొనసాగుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: