జనసేనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యేక వ్యుహం ఉన్నట్లు పవన్  కల్యాణ్ చెబుతున్నారు. కానీ ఆయన  వ్యుహం మాత్రం అందరికీ తెలిసిపోతుంది. వ్యుహం అనేది బయట వారికి తెలియకూడదు. జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించాలనేది పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు. మనం గెలిచేందుకు వేసిది వ్యుహం. ఇతరులను బురిడీ కొట్టేంచేది ఎత్తుగడ. ఇలాంటివి రాజకీయాల్లో చాలా కామన్. జనసేన పార్టీ గెలవాలంటే మాత్రం ప్రత్యేక వ్యుహాలు రచించుకోవాలి. 175 స్థానాల్లో ముందుగా అభ్యర్థులను పెట్టుకోగల సామర్థ్యం సాధించాలి.


ఎందుకంటే టీడీపీతో, బీజేపీతో గానీ పొత్తు విషయంలో చెడితే వెంటనే ఎన్నికలకు ఒంటరిగా వెళ్లే శక్తి సంపాదించాలి. వ్యుహాలు రచించడంలో ఎత్తుగడ వేయడంలో దాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో జాగ్రత్తలు అవసరం. జగన్ ను గద్దె దించేందుకు ఎలాంటి వారితోనైనా పొత్తుకు సిద్ధమని ఒక సారి ప్రకటించడం, తర్వాత జరిగిన జనసేన ఆవిర్భావ సభలో కుల రాజకీయాలు తరిమివేయాలని చెప్పడం, ఇంకోసారి జన సేన కార్యకర్తలు గానీ ప్రజలు గానీ బీజేపీ కి దూరంగా ఉండాలని కోరుకుంటే సిద్ధమని చెబుతు  వివిధ రకాల స్టేట్ మెంట్ లు ఇస్తున్నారు.


రాజకీయ నాయకుడికి ప్రజల నుంచి ఓట్లు ఆశించి వాటిని రాబట్టుకోవడంలో ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలనే ఆలోచన ఉండాలి. దానికి సీనియర్ అయినా రాజకీయ మేధావుల సలహాలు తీసుకోవడంలో తప్పు లేదు. వ్యుహ రచన చేస్తే అధికార పీఠం దక్కేలా ఉండాలి. కానీ దాన్ని బహిరంగంగా తెలియపరిస్తే అది కాస్త అందరికీ తెలిసిపోతుంది. అప్పుడది రహస్యంగా ఉండదు. రాజకీయాల్లో రహస్యంగా మంతనాలు జరపడం  తెలుసుకోవాలి.


వ్యుహం, ఎత్తుగడలతో అంతిమ లక్ష్యం చేరుకునేందుకు ప్రణాళికలు వేసుకోవాలి. జనసేన విషయంలో పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రసంగాలు అర్థమై, అర్థమవనట్లు ఉంటున్నాయనే టాక్ వినిపిస్తోంది. మొన్నీమధ్య బీజేపీ నాయకులతో, టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. కానీ దాని వెనక ఎలాంటి మతలబు చేస్తున్నారో ప్రజలకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: