
అంటే దానికి బాజ్వా సమాధానం ఇస్తూ మనం భారత్ ను కొట్టడం కాదు, భారతదేశం తలుచుకుంటే 48 గంటల్లో మనల్ని నాశనం చేసేస్తుంది. మన దగ్గర ఉన్న యుద్ధ ట్యాంకుల్లో పెట్రోల్ పోయడానికి కూడా మన దగ్గర ఇది లేదు. అమెరికా, యూరప్ దేశాలు మనకు ఏమీ ఆయుధాలను సప్లై చేయడం లేదు. మరోపక్క భారత్ చూస్తే కొత్త కొత్త అధునాతనమైన ఆయుధాలను తయారు చేసుకుంటుంది కాబట్టి, అది తలుచుకుంటే 48 గంటల్లో మన పని అయిపోతుంది అని అన్నారట. అది కాస్త ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దాంతో గతంలో బాజ్వాను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్న ఇమ్రాన్ ఖాన్ ఆ బాజ్వా వల్ల జైలు పాలు కావడం కూడా జరిగిందని తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా ఇమ్రాన్ ఖాన్ అయితే బాజ్వాను అరెస్టు చేయమని చెప్పి చెప్పాడని తెలుస్తుంది. ఇమ్రాన్ ఖాన్ ను దింపేసింది బాజ్వా అయితే, బాజ్వాని దింపేసిన వాళ్ళు షాభా షరీఫ్ వాళ్లని తెలుస్తుంది. బాజ్వాను ఇమ్రాన్ ఖాన్ తమ నెత్తిన రుద్దుతున్నారని షాభా షరీఫ్ తిట్టుకుంటున్నారట ఇప్పుడు.
వీళ్ళలో వీళ్ళు తిట్టుకుంటున్నారు, బానే ఉంది. కానీ మధ్యలో భారత దేశాన్ని కూడా ఈ వాగ్వివాదంలోకి తీసుకువచ్చి మాట్లాడుతున్నారట. బాజ్వా భారత్ గురించి అంత శక్తివంతమైనదని పొగుడుతున్నాడు కాబట్టి అర్జెంటుగా బాజ్వాని అరెస్టు చేయండి అంటూ, అసలు భారతదేశం గెలుస్తుంది అనే పదం కూడా వినలేక మాట్లాడుతున్నారట వాళ్ళు.