భారతదేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదనలు వెల్లడించింది. దీనిపై ఏప్రిల్ 26న కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశ వివరాలు తాజాగా విడుదలయ్యాయి. విభజన చట్టానికి సంబంధించి ఈ ఏడాదితో పదేళ్లు పూర్తవుతున్న సందర్భంలో, మిగిలిన వాటి పరిస్థితి ఎలా ఉన్నా, ఏపీ భవన్ విభజన గురించిన కేటాయింపుల లెక్క బయటకు వచ్చిందని తెలుస్తుంది.


ఏపీ భవన్ కి 19.3ఎకరాల ప్రదేశం ఉందని, దాని ప్రకారం ఏపీకి 12.9ఎకరాలు, తెలంగాణకి 7.64ఎకరాలు కేటాయించినట్లుగా తెలుస్తుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించిందని తెలుస్తుంది. ఏపీ భవన్ విభజనకి ఆంధ్రప్రదేశ్ కి 3, తెలంగాణకి 2 ఆప్షన్లు ఉన్నాయని తెలుస్తుంది. అయితే కేంద్రం ఆప్షన్-ఈ తో ముందుకు వచ్చింది.‌


కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన ఆచరణ యోగ్యంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ దీనిని స్వాగతించిందని కేంద్ర హోం శాఖ తెలిపింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇంకా తేల్చాల్సి ఉందని చెప్పింది. ఏపీ ఆప్షన్ ఏంటంటే తెలంగాణకు శబరి బ్లాకు, పటౌడి హౌస్ లో సగభాగం, ఏపీకి గోదావరి బ్లాకు, నర్సింగ్ హాస్టల్ బ్లాకు, పటౌడి హౌస్ లో సగభాగం అని తెలుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆప్షన్-బి ఏంటంటే, ఏపీకి పటౌడి హౌస్ మొత్తం, శబరి బ్లాక్ కూడా. అలాగే తెలంగాణకు గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ అని తెలుస్తుంది.


అలాగే తెలంగాణ ఆప్షన్-సి ఏమిటంటే, తెలంగాణకు శబరి, గోదావరి బ్లాకులు, ఏపీకి నర్సింగ్ హాస్టల్, పటౌడీ హౌస్ లు అని తెలుస్తుంది. తెలంగాణ ఆప్షన్-డీ వచ్చి తెలంగాణకు శబరి, గోదావరి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్ 12.9 ఎకరాలు, ఏపీకి పటౌడీ హౌస్ అని అంటుందట. కేంద్రం లెక్క ఏంటంటే ఏపీకి శబరి, గోదావరి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్ తో సహా 12.9ఎకరాలు, తెలంగాణకు పటౌడీ హౌస్ తో పాటు 7.64ఎకరాలు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: