దళిత ముస్లింలకు ఇంకా క్రైస్తవులకు మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు వర్తింపజేయాలని సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ & నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్ ద్వారా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.  అయితే దీనిపై తాజాగా సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కేంద్ర మాజీ జస్టిస్ బాలకృష్ణ నేతృత్వంలో ఒక కమిటీ వేసి దాని రిపోర్టు వచ్చాక ఈ అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రం కోర్టుకు తెలిపినట్లుగా తెలుస్తుంది.


అయితే మేము కమిటీ రిపోర్ట్ గురించి ఎదురుచూడడం మేమే నిర్ణయం తీసుకుంటామని చీఫ్ జస్టిస్ ఆ మధ్యన అన్నట్లుగా తెలుస్తుంది. అయితే మతం మారిన దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా  పలు పర్యావసనాలు ఏర్పడుతున్నాయని తెలుస్తుంది. అంతేకాకుండా క్రైస్తవ సమాజంలోని ప్రధాన మత సమస్యలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని పేర్కొంటూ ఒక క్రైస్తవ మహిళ సుప్రీంకోర్టులో ఇంటర్వెన్షన్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది.


పిటిషనర్లు కోరిన ప్రయోజనాలు క్రైస్తవ మతం యొక్క ఉనికి పై ముందస్తు దాడి అని, ఇది పాపం చేయడంతో సమానమేనని  ఆమె పిటిషన్ లో పేర్కొనడం ఇక్కడ కీలకమైన అంశంగా కనిపిస్తుంది. ఆమె మాట్లాడుతూ రిజర్వేషన్లు ఇవ్వాలనే పిటిషన్ ఆమోదించబడితే క్రిస్టియన్ కమ్యూనిటీ లోని వివిధ వర్గాల నుండి ఇలాంటి డిమాండ్లు వల్ల సామాజిక అసమతుల్యతను సృష్టిస్తాయని ఆవిడ అన్నారు.


దళిత క్రైస్తవులు అనే కమ్యూనిటీ ఉనికి లోకి రావడం, పవిత్ర బైబిల్ తిరిగి వ్రాయడం లాంటిదేనని ఆవిడ అన్నారు. బైబిల్ ని వ్రాయడం అనేది ఒక్క దేవుడు మాత్రమే చేయగలరని, అది అశాశ్వతమైన మనిషి వల్ల జరగని పని అని ఆవిడ పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాలు అనే పదంలో కులాలు అనే పదం వర్ణ వ్యవస్థతో అంతర్లీనంగా పెనవేసుకుపోయిందని ఆమె అన్నారు. వర్ణ వ్యవస్థకు పూర్తి విభన్నమైన క్రైస్తవ మతానికి దాన్ని విస్తరింప చేస్తే అది క్రైస్తవ మతంలో జోక్యం చేసుకోవడమేనని ఆవిడ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: