భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్యన సంబంధాలు అంత బలంగా లేవనే విషయం చాలావరకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ కర్ణాటకలో బిజెపి పరిస్థితికి చంద్రబాబు నాయుడు కారణం అన్నట్టుగా చెప్పుకుంటున్నాయని తెలుస్తుంది. వాళ్ల అనేది ఏంటంటే కర్ణాటకలో బిజెపి పని అయిపోయింది, దాని వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నారు అని అంటున్నారని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు అక్కడ కాంగ్రెస్ కు ఓట్లు వేయిస్తున్నారు, జెడిఎస్ కు ఓట్లు వేయిస్తున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు.


ఎవరు ఎలా అన్న నిజం మాట్లాడుకోవలసివస్తే చంద్రబాబు నాయుడు అలా చేయరని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఎప్పటినుండో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీకి సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ బిజెపి వాళ్ళే తెలుగుదేశం పార్టీని పక్కన పెడుతున్నారు.  మరి ఇలాంటి సందర్భంలో ఆయనపై ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియడం లేదని కొంతమంది అంటున్నారు.


ఆయన తన కుటుంబ సభ్యులు కన్నా కూడా ఎక్కువగా పార్టీ మెంబర్స్ ను అభిమానిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తిపై అభిమానంతోనైనా సరే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 2018 లో కూడా అక్కడ అలాగే జరిగిందని కొంతమంది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మోడీ చంద్రబాబు నాయుడు చెప్పినట్లు నడవడం లేదని అసలు చంద్రబాబు నాయుడు మనసులో లేని మాటని చెప్పుకొచ్చారు అప్పుడు.


అదే భావనతో వాళ్లు కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు అప్పుడు. దానితో బిజెపికి తెలుగుదేశం పార్టీపై ఒక అనుమానపు బీజం పడింది అని తెలుస్తుంది. తర్వాత గుజరాత్ కి డబ్బులు పంపించిన నేపథ్యంలో ఈ అనుమానం పెరిగి పెద్దదైంది అన్నట్లుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో సోనియా గాంధీ గాని, మోడీ గాని ఉండాలన్నట్లుగా వాళ్లు మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఆయనపై ఉన్న అంతులేని అభిమానంతోనే వాళ్లకు తెలియకుండానే ఆయనకు  చెడు చేస్తున్నారని మరి కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: