కర్ణాటకలో రేపు ఎన్నికల కౌంటింగ్‌ ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. పోలింగ్‌ రోజు మధ్యాహ్నం వరకే అయితే దాదాపు 60 శాతం పోలింగ్ జరిగింది. ఆ తర్వాత సాయంత్రానికి పోలింగ్‌ శాతం  పెరిగింది. ఆ తర్వాత ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. సర్వే ఫలితాలు అనేవి ప్రామాణికం కాకపోయిన చాలా సార్లు అవి నిజమని నమ్ముతారు. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా స్మార్ట్ సంస్థ కాంగ్రెస్ పార్టీ అధికారం ఖాయమని చెబుతోంది.


122 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని 41.3 శాతం ఓట్లు సాధిస్తుందని తెలిపింది. 34.8 శాతం ఓట్లతో బీజేపీ 77 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది.  16 శాతం ఓట్లతో జేడీఎస్ 23 సీట్లను గెలుచుకుంటుందని పేర్కొంది.  ఇతరులు 7 శాతం ఓట్లతో 2 సీట్లను గెలుచుకుంటుందని వివరించింది. కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు. కానీ స్మార్ట్ సర్వేలో 122 స్థానాలు కాంగ్రెస్ కు వస్తాయని తేలడంతో హస్తం పార్టీ అధికారం చేజిక్కుంచుకోవడం ఖాయంలా కనిపిస్తోంది.


ఒక వేళ కాంగ్రెస్ కు 100 లేదా 110 స్థానాలు వస్తే అప్పుడు పోటీ రసవత్తరంగా ఉంటుంది. జేడీఎస్ ను కలుపుకుని బీజేపీ అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ రెండు అధికారం కోసం ప్రయత్నాలు చేస్తాయి. రెండు పార్టీలకు సరైన మెజార్టీ రాకపోతే జేడీఎస్ తన మార్కును చూపించే సమయం వస్తుంది. అప్పుడు జేడీఎస్ కుమార స్వామి మళ్లీ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. బీజేపీ 104 స్థానాలతో కాస్త దూరంలో ఆగిపోయింది. అప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ లు కలిసి కర్ణాటకలో అధికారం చేపట్టాయి. మరి రేపు కర్ణాటక రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో.. ఎన్ని రాజకీయాలు జరుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: