గతంలో ఇండియా రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసేది. ఫ్రాన్స్, రష్యా లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. కానీ ప్రస్తుతం భారత్ నుంచి ఆఫ్రికా ఆయుధాలు కొనుగోలు చేస్తుంది. అయితే అమెరికా, చైనా ల నుంచి ఆఫ్రికా దేశాలు ఆయుధాలు కొనుగోలు చేయకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి అమెరికా ఎక్కువ ధరలకు అమ్ముతుంది. అంత ధర పెట్టి కొనే శక్తి ఆయా దేశాలకు లేవు. చైనా నుంచి కొందామంటే ఇప్పటికే చైనాకు ఆఫ్రికా దేశాలు చాలా వరకు అప్పులు చెల్లించాల్సి ఉన్నాయి.


అందులో చైనా ఆయుధాలు అంటే అంత నమ్మశక్యంగా ఉండవు అని ఆఫ్రికన్లు  భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్ రకరకాల ఆయుధాలకు అమ్మడానికి రెడీ అయింది. ప్రస్తుతం ఆయుధాల ఎగుమతులు ప్రారంభించింది. 2016-17లో భారత్ 1627 కోట్ల రూపాయల ఆయుధాలను ఎగుమతి చేస్తే.. గతేడాది దాదాపు 16 వేల కోట్ల రూపాయల ఆయుధాలను ఎగుమతి చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాం.


వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో సుమారు 5 బిలియన్ డాలర్ల ఆయుధాలను అమ్మాలనుకుంటోంది. సుమారు 32 వేల కోట్ల రూపాయల ఆయుధాలు అమ్మాలని నిర్ణయించుకుంది. ఇందులో ఆఫ్రికా దేశాలకే ఎక్కువ ఆయుధాలు ఎగుమతి చేయాలని అనుకుంటోంది. దాదాపు 70 శాతం ఆయుధాలు ఆఫ్రికా దేశాలకు అందించనుంది. ఆఫ్రికా దేశాలకు అనుకూలమైన ధరల్లో వీటిని తయారు చేసి ఎగుమతి చేయడానికి నిర్ణయం తీసుకున్నాయి.


ఆర్మ్ డ్ వెహికల్స్, నైట్ విజన్ వెహికల్స్, గన్స్, తదితర వెపన్స్ ఎక్కువగా కావాలని కోరుతున్నారు. లాకిడ్ మార్టిన్, టాటా, అదానీ సంస్థలు ఈ వెపన్స్ ను తయారు చేస్తున్నాయి. లెదర్ వెపన్స్, ఫైటర్ జెట్స్, మిస్సైల్స్, కూడా అమ్మనున్నాం. ఫిలిఫ్పీన్స్ కు ఇప్పటికే బ్రహ్మోస్ ను ఎగుమతి చేశాం. ఇండోనేషియా కూడా కావాలని అడుగుతోంది. అయితే ఇండియాకు పోటీగా దక్షిణ కొరియా ఆయుధాలను అమ్మడానికి ప్రయత్నాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: