
గతంలో ప్రింట్ మీడియాలో కోటి రూపాయలు వసూలు చేసే పత్రికకు కేవలం 50 లక్షలు వసూలు చేస్తున్నారు. అయినా దానికి ప్రకటన ఇవ్వడానికి వెనక్కి వస్తున్నారు. ఆ తర్వాత టీవీ చానళ్ల పరిస్థితి ఇలాగే తయారైంది. డిజిటల్ మీడియాలో యూట్యూబ్ చానళ్లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. 2022 మార్చి తాజాగా మీడియా ప్రకటనల ఆదాయంలో డిజిటల్ మీడియా వాటా 48 శాతం, టీవీల మీడియా 30, ప్రింట్ మీడియా 16 శాతం ఉందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం డిజిటల్ మీడియా వైపు ప్రపంచం పరుగులు పెడుతోందని దీని ద్వారా అర్థం అవుతోంది.
ముఖ్యంగా డిజిటల్ మీడియా అనేది ప్రపంచ వ్యాప్త సమాచారాన్ని తాజాగా అయిదు నిమిషాల్లో మన స్మార్ట్ ఫోన్ల ద్వారా తెలియజేస్తుంది. అది ఎలాంటి వార్త అయినా, ప్రపంచంలో ఎక్కడ, ఏ మూలన ఏ సంఘటన జరిగినా దాన్ని క్షణాల్లో ప్రసారం చేసేస్తుంది. కొన్ని వీడియోల రూపంలో కొన్ని టెక్ట్స్ ల రూపంలో మరి కొన్ని వాయిస్ ఇలా ఏదైతేనేం ప్రతిదీ శరవేగంగా పాఠకుడికి అందజేస్తోంది. దీని వల్ల ఎక్కువ మంది పేపర్ ను కొని చదవడం మానేశారు. టీవీల్లో కూడా ఛానళ్లను చూడటం మానేశారు. టీవీ ఛానళ్లను కూడా స్మార్ట్ ఫోన్ల ద్వారానే చూస్తున్నారు. ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో పత్రికలను కూడా ఆన్ లైన్ లోనే అప్ లోడ్ చేస్తున్నారు.