2016 నవంబరు 8 అర్థరాత్రి నుంచి మొదలుకొని అన్ని 500, 1000 రూపాయల నోట్లు చట్టబద్ధంగా రద్దు అంటూ, అప్పట్లో వెయ్యి రూపాయల నోట్లు చలామణిని ఆపేశారు మొదటగా. 2016 నవంబరు 8న చేసిన ప్రత్యేక ప్రసంగం ద్వారా ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. కాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల విషయంలో మరొక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.


ఇది ఏ రోజుకి ఆరోజు సంపాదించుకునే వాళ్ళకి పెద్ద సమస్య కాదు. కానీ బ్లాక్ మనీని బాగా పొదుపు చేసే కొంతమంది బడా వ్యక్తులకి ఇది షాకింగ్ విషయం అని తెలుస్తుంది. మామూలుగా అయితే 500 నోట్లు ఒక వెయ్యి కలిపితే ఐదు లక్షలు అవుతుంది. అదే 2000 నోట్లు అయితే గట్టిగా 50 నోట్లు  ఉంటే 5 లక్షలు అయిపోతుంది. అంటే చిన్న నోట్ల ద్వారా ఎక్కువ డబ్బును దాచుకోవాల్సి వస్తే పెద్ద నోట్ల ద్వారా వాటిని తక్కువ మొత్తంలోకి మార్చి దాచుకోవడానికి వీలు ఉండేది గతంలో.


ఈ ప్రకటన వచ్చేవరకు కూడా సమాజంలో పెద్ద మొత్తంలో  బాగా డబ్బు సంపాదించే  బడా బడా వ్యక్తులు, రాజకీయ వేత్తలు, సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు, వ్యాపారవేత్తలు ఇలా అనేకమంది దగ్గర ఈ 2000 నోట్లు ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది. ఎందుకంటే ఈ 2000 నోట్ల ద్వారా వాళ్ళు ఎక్కువ మొత్తం సొమ్మును దాచుకోవడానికి వీలుంటుంది కాబట్టి. ఎంత ఆన్లైన్లో మనీ ట్రాన్సాక్షన్ జరిగిన కూడా, జరుగుతున్న కూడా చాలాసార్లు డబ్బును ఆఫ్లైన్లో కూడా వినియోగించాల్సిన అవసరం ఉంటుంది ఎవరికైనా.


ఆ టైంలో ఈ రెండు వేల రూపాయల నోట్లు ఉంటే ఎంత పెద్ద అమౌంట్ నైనా సరే ఈజీగా వినియోగించేవారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయడంతో ఎవరి దగ్గర ఎన్ని 2000 నోట్లు ఉన్నాయో బయటకు తీయాల్సిన సమయం వచ్చింది వాళ్ళకి ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: