నిరుద్యోగులకు ఐఓసీల్ సంస్థ శుభవార్త తెలియజేసింది.  జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ ఇలా తదితర పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇక పానిపట్ రిఫైనరీస్ డివిజన్ లో 57 పోస్టులు ఫరీదాబాద్ లోని ఐఓసీల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ లో 6 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సంస్థ తెలియజేసింది. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను  https://iocl.com/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.

ఇక దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి విద్య అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకొని అప్లై చేసుకోవడం మంచిది. ఎందుకనగా వివిధ కోర్సు, వివిధ విద్యా అర్హతలు ఉన్నాయి. ఇక నోటిఫ్కేషన్ సంబంధించి పోస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం ఖాళీలు 63 ఉండగా అందులో...  జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్ ఫిట్టర్ కమ్ రిగ్గర్)- 3 పోస్టులు, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (ఇన్స్ట్రుమెంటేషన్) - 4 పోస్టులు, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ (ప్రొడక్షన్)- 49 పోస్టులు, సీనియర్ రీసెర్చ్ మేనేజర్ 2 పోస్టులు, రీసెర్చ్ ఆఫీసర్- 2 పోస్టులు, చీఫ్ రీసెర్చ్ మేనేజర్  2 పోస్టులు, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ ఒక పోస్టు
ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు వయోపరిమితి 18-26 సంవత్సరాలు ఉండాలి.. అలాగే ఎస్సీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయసులో సడలింపు ఉంది. ఇక ఈ పోస్టులను రాత పరీక్షల ద్వారా భర్తీ చేయబోతున్నారు. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్ కి ఓబిసి అభ్యర్థులకు 150 రూపాయలు...  అలాగే ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు ఎటువంటి ఫీజ్ అవసరం లేదు. ఆసక్తి గల, అర్హత గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ ను చదివి అర్హత కలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు అప్లై చేసుకోవడానికి 2020 అక్టోబర్ 1 నుండి మొదలవ్వగా దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 7, 2020. అభ్యర్థులు https://www.iocrefrecruit.in/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులను అప్లై చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: