Walmart Layoffs: ఇక ఆర్ధిక మాద్యం కారణంగా భయంతో వణికిపోతున్న మల్టీ నేషనల్ కంపెనీలు తమ ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి. చాలా మంది ఉద్యోగులు కూడా అనుక్షణం ఎంతగానో భయపడుతూ బ్రతుకుతున్నారు. ఇక ఇప్పటికే అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి.అయితే కేవలం ఐటీ కంపెనీలు మాత్రమే కాకుండా రిటైల్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి. అందులో భాగంగా ఫేమస్ రిటైల్ కంపెనీ అయిన వాల్ మార్ట్ కూడా తమ ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తుంది. ఇక యూఎస్ వాల్‌మార్ట్ సౌత్ న్యూజెర్సీ సదుపాయంలోని దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం తెలుస్తుంది. వాల్‌మార్ట్ కాంపిటిటర్ అయిన అమెజాన్ ఇప్పటికే రెండు దఫాలుగా 27 వేల ఉద్యోగాలను తొలగించింది. వాల్‌మార్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో నెమ్మదిగా అమ్మకాల వృద్ధిని ఇంకా తక్కువ లాభాలను అంచనా వెయ్యడం కారణంగా ఈ ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.


ఆన్‌లైన్ సేల్స్ అనేవి పాండమిక్ టైంలో చాలా భారీగా ఉన్నప్పటికీ... నాల్గో త్రైమాసికంలో, వాల్‌మార్ట్ స్టోర్‌లు ఇ-కామర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా బలమైన ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి. వాల్ మార్ట్ కంపెనీ గత కొద్ది సంవత్సరాలుగా ఆటోమేషన్ పై భారీగా పెట్టుబడి పెట్టింది.ఇ-కామర్స్ ఆర్డర్‌లను ప్రాసెస్ చేయడానికి ఉద్యోగులను 12 శాతం నుంచి 5 శాతం తగ్గించడంలో సహాయపడటానికి నాప్ వంటి కంపెనీలతో కూడా భాగస్వామ్యం చేసుకొని ముందుకెళ్తోంది.ఈ ఏడాది $15-బిలియన్ కంటే ఎక్కువ మూలధన వ్యయ బడ్జెట్‌లో భాగంగా ఆటోమేషన్ టెక్నాలజీలో పెట్టుబడులను పెంచే ప్లాన్ వల్ల సంతోషిస్తున్నామని వాల్‌మార్ట్ CEO డగ్ మెక్‌మిల్లన్ ఫిబ్రవరిలో  చెప్పారు.ఇలా వరుస కంపెనీలు ఉద్యోగులకు షాక్ ఇవ్వడంతో అనుక్షణం ఉద్యోగులు చాలా భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఈ ఆర్ధిక మాంద్యం ఎప్పుడు తీరుతుందో చూడాలి.అయితే దీనికి ఉద్యోగుల పని తీరు కూడా ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అందుకే విద్యార్థులు కాలేజీ డేస్ నుంచే బాగా చదువుకొని తమ స్కిల్ ని డెవలప్ చేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి వారికి రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: