ఇప్పటి వరకు అసలు.. మంత్రి వర్గాన్ని రెండున్నరేళ్లకే విస్తరించాలి. కానీ, కరోనా కారణంగా.. ఇది ఆలస్యమైంది. దీంతో ఇప్పుడున్న మంత్రులు దాదాపు మూడేళ్లు పూర్తి చేస్తున్నట్టుగా నే భావించాలి. సో.. వచ్చే వారు.. మరింతగా పుంజుకుని పనిచేయాలంటే.. వారికి తొలి ఆరు మాసాలు కూడా శాఖలను అర్ధం చేసుకోవడం.. అధికారులపై పట్టు పెంచుకోవడం.. ప్రజలకు అందుతున్న సంక్షేమం.. ఇతర అంశాలపై పట్టు సాధించేందుకు సరిపోతుంది. అంటే.. ఎంత వేగంగా వేసుకున్నా.. కొత్త మంత్రులు పుంజుకునేందుకు కనీసం ఆరు మాసాల సమయంలో పోయినా.. మిగిలిన ఏడాదిన్నర మాత్రమే వారికి మిగులుతుంది.
అందునా.. మళ్లీ ఎన్నికలకుముందు ఆరు మాసాలు అదో హడావుడిగా ఉంది. సో.. ఇతమిత్థంగా కొత్తమంత్రులను ఇప్పటికి ప్పుడు.. నియమిస్తే.. వారికి ఉండే సమయంలో రెండుసంవత్సరాలే. ఇంకా లేటు చేస్తే.. ఇబ్బందులు తప్పవు. ఇదే విషయంపై జగన్ కూడా దృష్టిపెట్టినట్టుచెబుతున్నా
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి