జనసేన తెలుగుదేశంతో కలిసి పోటీకి సిద్ధంగా ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, భారతీయ జనతా పార్టీ గానీ, కమ్యూనిస్టులు కానీ, అందరూ ఇదే నమ్ముతున్నారు. అయితే ఈ మాటల్లో నిజం లేదని వాళ్ళు చెప్పే మాటల ద్వారానే తెలుస్తుంది. కానీ ఇప్పటికి కూడా  పవన్ కళ్యాణ్ ఒంటరిగానే పోటీ చేస్తారు, బిజెపితోనే అనేది ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు నమ్ముతున్నారు.


కానీ పవన్ కళ్యాణ్ ని నిజంగా ఇష్టపడేవారు, పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకునేవారు, వీళ్ళందరూ కూడా ఆయన మాటలను ఢీకోడ్ చేసి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గతంలో చెప్పినట్టే జగన్ అనుకున్నది జరగనివ్వను అంటే జగన్ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వకూడదు అనుకుంటారు కాబట్టి తాను సీఎం అవుతానని ఇండైరెక్ట్ గా చెప్పడం ఒకటి, రెండవది కార్యకర్తలు అనుకునేది చేస్తాను అంటే కార్యకర్తలు గాని, అభిమానులు గాని ఏం కోరుకుంటారు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనే కదా! కాబట్టి అది కూడా జరుగుతుందని ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నట్లు సమాచారం.


తెలుగుదేశంతో పొత్తు అయితే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం సాధ్యం కాదు కాబట్టి బిజెపిలోని లోపాలను సరిదిద్దుతూ, రాష్ట్ర నాయకత్వాన్ని కూడా అటాచ్మెంట్ తో పెంచుతూ, లోపాలను రైజ్ చేయడం ద్వారా బిజెపి జనసేన బంధాన్ని పెంచుకుంటూ, ఇద్దరు కలిసి వెళ్ళేటట్లు తద్వారా 40-50సీట్లు సాధిస్తే,  జెడియం కి కాంగ్రెస్ ఎలా మద్దతు ఇచ్చిందో అలాగే జనసేనకు కూడా తెలుగుదేశం పార్టీ మద్దతునిచ్చే పరిస్థితి వస్తుందని వాళ్ళ ఆలోచన.


అదే సందర్భంలో తెలుగుదేశం గురించి పాజిటివ్ గా ఎందుకన్నారంటే తెలుగుదేశం అనుకూల మీడియా, వాళ్లతోనే కలిసి వెళ్తారనే ఫీలింగ్ తో పవన్ గురించి పాజిటివ్ వార్తలు రాస్తుందనీ. వైసిపి మీడియా నెగిటివ్ వార్తలు రాస్తుందనీ . తద్వారా  జనసేనని లైమ్ లైట్ లో ఉంచుతారని జనసేన ప్లాన్ అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: