
సంక్షేమ పథకాల అమలు వల్ల ప్రజలకు లాభం చేకూరుతుందన్నది నిజం. కానీ వాటిని ప్రవేశపెట్టిన తర్వాత తీసేయడం కుదరదు. కానీ ఆ పథకానికి డబ్బులు ఎలా సమకూరుస్తారన్నది అసలైన ప్రశ్న. ఇప్పటికే అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారు. ఎప్ ఆర్ బీఎం కూడా కొత్త అప్పులు ఇచ్చేందుకు సిద్దంగా లేనట్లు తెలుస్తోంది. ఉచిత పథకాలు ప్రవేశపెట్టడం వల్ల శ్రీలంక లాంటి పరిస్థితులు రాష్ట్రంలో కూడా వస్తాయని పత్రికలు, మీడియా సంస్థలు, కొంత మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ప్రభుత్వానికి మనుగడ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను తొలగిస్తామని ప్రచారం చేసి గెలవగలదా లేదు. కానీ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనుల వల్లే రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతుందని విమర్శలు చేస్తోంది. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టినవే అని మరిచిపోతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న మీడియాతో రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయని ప్రచారం చేస్తున్నారు.
అయితే ప్రభుత్వం కొన్ని విషయాల్లో అప్పులు చేయక తప్పదు. కానీ దానికి తగిన ఆదాయం వచ్చేలా కొన్ని ప్రణాళికలు వేసుకోవాలి. ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాల అమలును ఆపలేవు. కానీ ఖర్చును తగ్గించుకుని ప్రజల నెత్తిపై మోసిన అప్పుల భారాన్ని తగ్గిస్తే మంచిది.