రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా మూడు అంచెల్లో ఉక్రెయిన్ ను దెబ్బతీస్తుంది. మొదటి అంచెలో ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ని, ఎవరైతే ఆయుధాలు బాగా వాడగలరో వాళ్ళని చంపేస్తుంది. రెండో అంచెలో వాళ్లు దాక్కునే ప్రదేశాలను సాటిలైట్స్ ద్వారా ఐడెంటిఫై చేసి చంపేస్తుంది. మూడో దశలో వాళ్ళు ఆయుధాలు స్టోర్ చేసుకునే ప్లేస్ ను గుర్తించి మరీ పేల్చేస్తుంది. ఎడతెరిపి లేని మిసైల్స్ దాడిలో తెలివైన ఎత్తుగడలు వేసుకొస్తుంది.


యుద్ధం మధ్య రష్యా ఉక్రెయిన్ స్థానాలపై దాడిని తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్ స్థానాలను లక్ష్యంగా చేసుకున్న  రష్యా కి సంబంధించిన 2ఎస్9 నోనా యొక్క నాటకీయ ఫుటేజీని రష్యా విడుదల చేసింది.  ఉక్రేనియన్ దళాలు ఉపయోగించిన భవనాన్ని రష్యన్ దళాలు పేల్చివేసినట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది,  రష్యా ఉక్రెయిన్ సరిహద్దు నుండి కేవలం 25 కి.మీ. దూరంలో ఉన్న ఉక్రెయిన్ కి సంబంధించిన బ్రయోన్స్కీ ప్రాంతంలో తేలికపాటి ఉక్రేనియన్ ప్లెయిన్ క్రాష్ జరిగింది అని పేర్కొంది.  


రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్  కూడా పైలట్ తప్పించుకుని ఉక్రెయిన్‌కు పారిపోవడానికి ప్రయత్నించాడని  కానీ సరిహద్దు కాపలాదారులు అతనిని పారిపోకుండా పట్టుకున్నారని ఈ సందర్భం గురించి వివరించారు. విషయం ఏమిటంటే ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి భవనం, 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక భవనం కూలింది. అయితే ఒక ప్రక్క ఉక్రెయిన్, అది ఉక్రెయిన్ పై రష్యా చేసిన దాడి అంటుంటే, అది దాడి కాదు ఉక్రెయిన్ కి సంబంధించిన యుద్ధ విమానాలు రష్యా సరిహద్దుల్ని దాటాలనుకుంటున్నాయి. అది చూసి దాన్ని రష్యన్ విమానాలు వెంటాడి కొట్టాయి, మిస్సయిల్స్ తో కొట్టాయి.


అలా కొట్టడంతో అక్కడ ఉక్రెయిన్ సైనికులు నివసించే బిల్డింగ్ పై కుప్ప కూలడం జరిగింది. ఆ సందర్భంలో ఆ ఎటాక్ జరగగానే అందులో ఉన్న పైలెట్ వెంటనే పారాషూట్ వేసుకొని దిగి పారిపోతుంటే అతన్ని  పట్టుకున్నాం, అంటే ఉక్రెయిన్ దెబ్బతీయడానికి వస్తే, మేమే దెబ్బతీశాం అని రష్యా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: