
తర్వాత కేసు ముందుకు సాగకుండా కేసీఆర్ , చంద్రబాబు ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు అనుహ్యంగా 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ ను ఎలాగైనా తెలంగాణలో ఓడించాలని సుడిగాలి పర్యటనలు చేశారు. కానీ అది కాస్త కేసీఆర్ కు ప్లస్ అయి మళ్లీ అధికారంలోకి వచ్చేలా చేసింది.
చంద్రబాబుకు కాకుండా జగన్ కు కేసీఆర్ మద్దతు తెలపడం ప్రారంభించారు. 2019 ఎన్నికల సమయంలో పార్టీలకు ఫండింగ్ ఇచ్చే కాంట్రాక్టర్లకు సంబంధించి చంద్రబాబుకు ఫండింగ్ నిలిపివేయాలని కేసీఆర్ ఆదేశించారని ప్రచారం జరిగింది. లేకపోతే తెలంగాణ లో నిర్మించే ప్రాజెక్టులను వేటిని మీకు ఇవ్వమని చెప్పినట్లు తెలుస్తోంది.
టీడీపీని ఆంధ్రలో కూడా ఆర్థికంగా ఎదగకుండా కేసీఆర్ రాజకీయ ఎత్తుగడ వేశారు. ఇదే సమయంలో జగన్ కు అనుకూలంగా ఇవ్వాలని చెప్పినట్లు సమాచారం. దీని వెనక కేసీఆర్ పెద్ద వ్యుహామే పన్నినట్లు తెలుస్తోంది. జగన్ కు అనుభవం లేదు. చెప్పినట్లు వింటాడని అనుకుని పరోక్షంగా సాయం చేశారని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ లోని ఇనుము అమ్మకాలను తెలంగాణ ప్రభుత్వ అనుకూల వ్యక్తులచే కొనిపించి, జగన్ కు చేతకాదని నిరూపించాలని తద్వారా ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కొనే ప్రయత్నం చేస్తున్నట్టు వాదనలు ఉన్నాయి. ఆంధ్రలోని జగన్ కు చేతకాదా అని అనిపించాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.