అక్కడక్కడ ఉపన్యాసాల్లో తప్పులు దొర్లినా.. వాటిని సవరించుకుంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆయా నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ నాయకుల శైలిని విమర్శిస్తూ వారి పనితనాన్ని ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. ఉపన్యాసం విషయంలో టీడీపీలో చాలా మందికి లోకేశ్ మాట్లాడుతుంటే ఎక్కడ తప్పులు దొర్లుతాయోనని భయపడేవారు. అలాంటిది ప్రజల్లోకి వెళ్లి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ కార్యకర్తల్లో అభిమానులు ఎక్కువ. చంద్రబాబు తర్వాత ఎన్టీఆర్ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.
ఇలా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నఎన్టీఆర్ ఎలాగూ పార్టీలో లేరు కాబట్టి టీడీపీలో ఉన్న ప్రజా ప్రతినిధులు మాత్రం లోకేశ్ వైపు చూస్తున్నారు. లోకేశ్ ను తమ నాయకుడిగా ఊహించుకుంటున్నారు. వారాహి యాత్ర నారావారి యాత్ర రెండు ఒకసారి ప్రారంభమయ్యాయి. అయితే వారాహి యాత్ర ఆగిపోయింది. కానీ నారా లోకేశ్ యువగళం యాత్ర మాత్రం 1200 కిలోమీటర్లు పూర్తి చేసుకుని ముందుకు సాగుతోంది.
ఈ సందర్భంగా అలూరు దగ్గర 1200 కిలోమీటర్ల మైలు రాయి వేశారు. మిడుతూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈ శిలాఫలకం వేశారు. ఎత్తిపోతల ద్వారా మిడుతూరు, కలమండం, మాదిగుండం, పారామంచలా గ్రామాల వారికి తాగునీరు ఇస్తాం, 60 వేల మందికి తాగునీరు, 20 వేల మందికి సాగు నీరు ఇస్తామనే వివరాలతో ఈ ప్రాంతంలో శిలాఫలకం వేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి