రాష్ట్ర విభజన అనేది చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్దాంతం ధోరణి కూడా తోడయ్యింది. కానీ చివరకు విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు తప్ప మరే ఇతర వ్యక్తి కాపాడతాడనే నమ్మకం ప్రజలకు కలగలేదు. దీంతో చంద్రబాబును సీఎం గా చేసుకున్నారు. అనంతరం అమరావతి రాజధాని అని కొత్త ప్రాంతంలో నిర్మించాలని చాలా ప్రయత్నాలు చేశారు. అయితే చంద్రబాబు హయాంలో అశోక్ బాబు ఎమ్మెల్సీ అయ్యారు. అశోక్ బాబు కు కావాల్సిన వారికి ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇప్పించారు.
అయితే అశోక్ బాబుకు వ్యతిరేకంగా పచ్చ మీడియా వార్తలు రాయలేదు. కానీ సీపీఎస్ రద్దు చేయాలని ప్రస్తుతం ఉద్యోగ సంఘాల నాయకుడు బండి వైసీపీ ప్రభుత్వం తో మాట్లాడుతున్నారు. అయితే మొదట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలకు అనుగుణంగా ఉద్యోగ సంఘాల నేత బండి పని చేసినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ ప్రభుత్వం జగన్ ఉద్యోగుల కోసం జీపీఎస్ ప్రవేశపెడతానని మాట ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలకు పని లేకుండా పోయింది.
అయితే బండిని ఇప్పుడు అదే పచ్చ మీడియా టార్గెట్ చేస్తోంది. కేవలం జగన్ ఎమ్మెల్సీ ఆఫర్ ఇస్తానని చెప్పాడు. దీంతో బండి లొంగిపోయాడని తెగ ప్రచారం చేస్తున్నారు. మరి ఆనాడు అశోక్ బాబు ఎమ్మెల్సీ పదవి తీసుకుని రాష్ట్రాన్ని విడగొట్టేందుకు ప్రయత్నించాడా అనే ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇలాంటి వార్తలు ఎల్లో మీడియా ఎందుకు రాయలేకపోతుందని విమర్శలు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి