
అయితే వీటిలోని లొసుగులను ఉపయోగించుకొని జగన్ ఇప్పుడు తెలివిగా తన పరిపాలనను విశాఖ కు మారుస్తున్నారు. విశాఖలోను సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు అనేది జగన్ అనుకూల పత్రికలో వచ్చిన వార్త. సెక్రటేరియట్ తరలిస్తే కోర్టు స్టే కు విరుద్ధమవుతుంది. క్యాంపు కార్యాలయం అనేది ఎక్కడ పెట్టుకోవాలనేది సీఎం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సీఎం ఎక్కడ ఉంటే అదే పరిపాలన రాజధాని. ఈ తర్వాత శాఖలను తీసుకువెళతారు.
ప్రస్తుతం అయితే శాఖలన్నీ అమరావతిలోనే ఉంటాయి. అక్కడ కొన్ని భవనాలు తీసుకొని అధికారులను తరలిస్తారు. ఆ తర్వాత కోర్టు తీర్పును అనుసరించి.. కోర్టు నిర్ణయం అనుకూలంగా వస్తే మొత్తాన్ని తరలిస్తారు. వ్యతిరేకంగా వస్తే క్యాంపు కార్యాలయ పరిపాలన సాగుతుంది. మూడు రాజధానులపై శాసన సభలో నిర్ణయం తీసుకోవచ్చా అనేది మాత్రమే కోర్టు తీర్పు ఇస్తుంది. ఆ చట్టాన్ని మేము ఉపసంహరించుకున్నాం అని ప్రభుత్వం చెప్తోంది. లేని చట్టంపై తీర్పు ఇవ్వొచ్చా అనేది సుప్రీం కోర్టు తేల్చాల్సి ఉంది.
అది తేలితే కేసు మారిపోయే అవకాశం ఉంది. రాజధానిని మూడు చోట్లకి మార్చవచ్చా అనేది మరో కోణం. ఒకవేళ మూడు రాజధానులు ఉండవచ్చు. రాజధానుల అంశం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తీర్పు ఇస్తే అప్పుడు సెక్రటేరియట్ ని అమరావతి నుంచి తరలిస్తారు. లేదంటే విశాఖ నుంచి క్యాంపు కార్యాలయ పరిపాలన మొదలవుతోంది. చివరికి జగన్ అనుకున్న విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తారు.