ఏపీ సీఎం చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలో న‌మ్మిన బంటుగా సేవ‌లు అందించేవారిలో ముందున్నారు.. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజ‌నేయ‌స్వామి. వృత్తి రీత్యా వైద్యుడు అయిన‌.. ఆయ‌న‌.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌వాలోనూ ఆయ‌న త‌న విజ‌య ప‌రంప‌ర‌ను కొన‌సాగించారు. 2024 ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న‌.. చేసిన పోరాటాలు.. పార్టీత‌ర‌ఫున వినిపించిన గ‌ళం వంటివి.. ఆయ‌న కోర‌కుండానే మంత్రి పీఠాన్ని అదేవిదంగా చంద్ర‌బాబు మ‌న‌సులోనూ స్థానం క‌ల్పించాయి.


ప్ర‌స్తుతం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న స్వామి.. అటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. ఇటు మంత్రిగా కూడా మంచి మార్కులు వేయించుకుంటున్నారు. ప్ర‌జ‌ల మ‌నిషిగా గుర్తింపుపొందిన స్వామి.. వ్య‌క్తిగ‌త ఆకాంక్ష‌ల‌కు దూరంగా.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌కు, వాటి ప‌రిష్కారానికి పెద్ద‌పీట వేసే నాయ‌కుడిగా కూడా గుర్తింపు పొందారు. నిరంత‌రంప్ర‌జ‌ల్లో ఉండే నాయ‌కులు కొంద‌రు ఉన్నారు. వీరిలో ముందు వ‌రుసలో నే ఉన్నారు స్వామి. సాంఘిక సంక్ష‌మే వ‌స‌తి గృహాల‌ను ప‌రిశీలించ‌డం.. మార్పులు చేయించ‌డం ద్వారా.. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా చూస్తున్నారు.


అంతేకాదు.. సాంఘిక సంక్షేమ వ‌స‌తి గృహాలకు విద్యుత్ విష‌యంలో కీల‌క సంస్క‌ర‌ణ‌లుకూడా తీసుకు వ‌స్తున్నారు. ప్ర‌తి వ‌స‌తి గృహానికి.. సౌర విద్యుత్ సౌర‌భాలు అందించేలా పక్కా ప్ర‌ణాళిక‌లు ర‌చించారు. వీటిని సాకారం చేయించ‌డం ద్వారా.. ప్ర‌భుత్వానికి కూడా విద్యుత్ చార్జీల భారాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆయ‌న‌కీల‌క పాత్ర పోషిస్తున్నారు. కొండ‌పి నియోజ క‌వ‌ర్గంలో కొన్నిద‌శాబ్దాలుగా ఉన్న తాగునీటి స‌మ‌స్య‌కు గ‌త నెల‌లోనే ఆయ‌న ప‌రిష్కారం చూపించారు.  


పార్టీ ప‌రంగా ఎవ‌రితోనూ విభేదాలులేని నాయ‌కుడిగా స్వామి ముందుకు సాగుతతున్నారు. నారా లోకేష్ ను అభిమానించే నాయ‌కుల‌కు కొద‌వ‌లేదు. కానీ.. నారా లోకేష్ అభిమానించే పార్టీ నేత‌ల్లో స్వామి ఒక‌రు కావ‌డం గ‌మ‌నార్మం. కొన్నాళ్ల కింద‌ట సీఎం చంద్ర‌బాబు ఇచ్చిన ర్యాంకుల్లోనూ స్వామి మేలిమి ర్యాంకు పొంద‌డం.. ఆయ‌న ప‌నితీరుకు అద్దం ప‌డుతుంది. వ‌రుస విజ‌యాలు.. పొంద‌డమే కాదు.. వ‌రుస‌గా ప్ర‌జ‌ల హృద‌యాల్లోనూ చోటు ద‌క్కించుకున్న నాయ‌కుడిగా  స్వామి పేరు పొందార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: