- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఏపీ ప్రభుత్వంలో చాలామంది మంత్రుల పనితీరు ఆశించినట్టుగా ఉండటం లేదని ఓపెన్ గానే సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో చెప్పేశారు. ఇక నుంచి రోజులు లెక్కపెట్టుకోవాలి అన్నట్టుగా మంత్రులను హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు ఎవరు పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారో పేరు బయటకు రాలేదు. కానీ చంద్రబాబు ఇలా మంత్రులకు ప్రతి క్యాబినెట్ లో వార్నింగ్ ఇస్తూ వస్తున్నారు. కొంతమంది మంత్రులపై వచ్చే అభియోగాలు .. మరికొందరు విధులు పట్ల నిర్లక్ష్యం చూపించడం వంటివి చంద్రబాబులో తీవ్ర అసహనానికి కారణం అవుతున్నాయి. పనితీరు మార్చుకునే వారు మార్చుకుంటారని ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపుతూనే ఉన్నారు. రాజకీయ ఆరోపణలను చాలామంది తిప్పి కొట్టలేకపోతున్నారు. ముఖ్యంగా తమ శాఖలపై లేదా కూటమిపై వచ్చే విమర్శలను ఘాటుగా తిప్పుకొట్టాలని చంద్రబాబు కోరుతున్న చాలామంది స్పందించడం లేదు.


తమ పార్టీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై వైసీపీ మాజీ ఎమ్మెల్యేఏ ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి అత్యంత ఘోరంగా మాట్లాడితే టిడిపిలో ఇతర నేతలు మంత్రులు స్పందించడానికి చాలా ఆలస్యం అయింది. వైసీపీలో ఇలాంటి కౌంటర్లు చాలా స్పీడ్ గా ఉంటాయి. ఈ విషయంలో టిడిపి పూర్తిగా వెనకబడింది. ప్రభుత్వంపై జరిగే నెగిటివ్ ప్రచారాన్ని కూడా చాలామంది మంత్రులు మన శాఖ కాదు .. మన జిల్లా కాదు అని లైట్ తీసుకుంటున్నారు. దీనిపై కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కొందరు మంత్రులు విధి నిర్వహణలో పనితీరు సరిగా లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వారి విషయంలో కూడా చంద్రబాబు సీరియస్గా దృష్టి పెట్టడంతో పాటు కచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని చెప్పినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా కచ్చితంగా కేబినెట్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: