
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్).. ముంబై రిఫైనరీలో 122 నాన్ మేనేజ్‌మెంట్ కేడర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ లో భాగంగా అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్.. అసిస్టెంట్ లేబొరేటరీ అనలిస్ట్ మొదలగు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఖాళీల వివరాలు : అసిస్టెంట్ ప్రాసెస్
టెక్నీషియన్-67, అసిస్టెంట్ బాయిలర్ టెక్నీషియన్-6, అసిస్టెంట్ లేబొరేటరీ
అనలిస్ట్-7, అసిస్టెంట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)-7, అసిస్టెంట్ మెయింటెనెన్స్
టెక్నీషియన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)-7, అసిస్టెంట్ మెయింటెనెన్స్
టెక్నీషియన్ (మెకానికల్)-9, ఫైల్ ఆపరేటర్-19.
విద్యార్హతలు: పోస్టులను బట్టి బీఎస్సీ కెమిస్ట్రీ/ఎస్‌ఎస్‌సీ+బాయిలర్
అటెండెంట్ కాంపెటెన్సీ సర్టిఫికెట్/డిప్లొమా (ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/మెకానికల్)/ఇంటర్మీడియెట్+బేసిక్
ఫైర్ ఫైటింగ్ కోర్సులో సర్టిఫికెట్/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.
వయసు: 2018, అక్టోబర్ 1 నాటికి 18-25 ఏళ్లు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), స్కిల్‌టెస్ట్. సీబీటీలో జనరల్ ఆప్టిట్యూడ్, టెక్నికల్/ప్రొఫెషనల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు
చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2018.
పూర్తి వివరాలు
వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: http://hindustanpetroleum.com