
భారత
రక్షణ శాఖ అయిన ఇండియన్ ఆర్మీ మహిళలకి దేశ సేవ చేసుకునే అవకాశాన్ని కలిపిస్తోంది.
ఆర్మీ లో ఉన్న 100 సోల్జర్ జనరల్ డ్యూటీ (ఉమెన్ మిలిటరీ పోలీస్) ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ
నోటిఫికేషన్ లో భాగంగా అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: కనీసం 45 శాతం మార్కులతో పదో
తరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, ఆరోగ్య ప్రమాణాలుండాలి.
వయసు: 17 1/2 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. అక్టోబర్ 1, 1998 నుంచి ఏప్రిల్ 1, 2002 మధ్య జన్మించి ఉండాలి.
వితంతు మహిళలకు గరిష్ట వయసు 30 ఏళ్లు.
ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక
చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 8, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://joinindianarmy.nic.in