కేవలం పదో తరగతితోనే రైల్వేలో ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తోంది. నార్త్‌ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే. గువాహటి ప్రధాన కేంద్రంగా ఉన్న నార్త్‌ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే స్పోర్ట్స్‌ కోటా ద్వారా స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం 16 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి స్పోర్డ్ కోటా కాబట్టి.. అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, క్రికెట్‌, సైక్లింగ్‌, పవర్‌లిఫ్టింగ్‌, వాలీబాల్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ లో ప్రావీణ్యం ఉన్నవారికే ఇస్తారు. ఈ ఉద్యోగాలకు అర్హత పదోతరగతి మాత్రమే.. కొన్ని ఉద్యోగాలకు ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

 

క్రీడాకారులు సంబంధిత క్రీడలో రాష్ట్రం లేదా దేశం తరపున ప్రాతినిధ్యం వహించి ఉండాలి. ఫీల్డ్‌ ట్రయల్స్‌, క్రీడా విజయాల మదింపు, విద్యార్హతల ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు చివరితేది: డిసెంబరు 16.

మరిన్ని వివరాల కోసం సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌, మాలీగావ్‌, గువాహటి, అసోం-781011 చిరునామాలో సంప్రదించవచ్చు. లేదా వెబ్‌సైట్‌: https://nfr.indianrailways.gov.in/ ను పరిశీలించివచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: