ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్.. ఐఓసీఎల్ సదరన్ రీజియన్ 248 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇవి అప్రెంటీస్ పోస్టులు కావడం గమనించాలి. ఈ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 

మొత్తం ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు: 248 ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 13 నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. దరఖాస్తులు పంపించేందుకు చివరితేదీ: జనవరి 27, 2020.

 

విద్యార్హతల వివరాలు.. ఐటీఐ గా ఉంటుందని భావిస్తున్నారు. అప్రెంటీస్ గా చేరినా.. ముందు ముందు అదే సంస్థలో ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతే కాకుండా ఆ సంస్థలో అప్రెంటీస్ చేసిన వారికి భవిష్యత్ నియామకాల్లోనూ తగిన ప్రాధాన్యత ఉంటుంది.

 

 

ప్రసిద్ధమైన కంపెనీ కావడంతో.. ఇక్కడ అప్రెంటీస్ చేసిన అనుభవం మీకు కేరీర్ లోనూ ఉపయోగపడుతుంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా కూడా దరఖాస్తులు పంపొచ్చు.. మరిన్ని వివరాల కోసం ఐ ఓ సీ ఎల్ వెబ్ సైట్ https://www.iocl.com/ ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: