ఏపీలో గ్రామ సచివాలయాలలో 1134 డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా ఉన్నవారు ధరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్నవారు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ నియామకాలను రాత పరీక్ష ద్వారా చేపడతారు. 13 జిల్లాలలో 1134 ఉద్యోగాలను రాత పరీక్ష ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనుంది. 
 
జిల్లాల వారీగా శ్రీకాకుళం జిల్లాలో 124, విజయనగరం జిల్లాలో 149, విశాఖపట్నం జిల్లాలో 33, తూర్పు గోదావరి జిల్లాలో 129, పశ్చిమ గోదావరి జిల్లాలో 117, కృష్ణా జిల్లాలో 31, గుంటూరు జిల్లాలో 16, ప్రకాశం జిల్లాలో 115, నెల్లూరు జిల్లాలో 46, చిత్తూరు జిల్లాలో 123, అనంతపురం జిల్లాలో 119, కర్నూలు జిల్లాలో 111, కడప జిల్లాలో 21 ఖాళీలు ఉన్నాయి. 
 
వయో పరిమితి : 02.07.1978 - 01.07.2002 మధ్య జన్మించి 01.07.2020 నాటికి వయస్సు 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనలను అనుసరించి వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. 
 
అర్హతలు : డిగ్రీ/ డిప్లొమా ( కంప్యూటర్స్, ఐటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ), బీసీఏ, బీఎస్సీ, ఎంసీఏ (కంప్యూటర్స్) / బీకామ్ (కంప్యూటర్స్) 
 
ధరఖాస్తు ఫీజు వివరాలు : పరీక్ష ఫీజు 200 రూపాయలు, ధరఖాస్తు ఫీజు 200 రూపాయలు అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ లకు మినహాయింపు ఉంటుంది. నాన్ లోకల్ జిల్లాలకు కూడా ధరఖాస్తు చేసుకుంటే అభ్యర్థులు అదనంగా 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 
 
ధరఖాస్తు, ఎంపిక విధానం : ఆన్ లైన్ ద్వారా సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 
 
జీతం : ఎంపికైన వారికి నెలకు 15,000 రూపాయలు చొప్పున మొదటి రెండు సంవత్సరాలు ఇస్తారు. నిబంధనల ప్రకారం ప్రొబేషన్ కాలాన్ని పూర్తి చేసిన అభ్యర్థులకు వేతనం ఉంటుంది. 
 
ముఖ్యమైన తేదీలు : 
 
ధరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 30.01.2020 
 
ఆన్ లైన్ ధరఖాస్తుకు చివరి తేదీ : 31.01.2020 

మరింత సమాచారం తెలుసుకోండి: