ప్రస్తుతం దేశం మొత్తం కరోనాతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అనేక కంపెనీలు మూతపడ్డాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో కూడా దేశంలోని కొన్ని కంపెనీలు నిరుద్యోగుల కోసం ఉద్యోగాలను విడుదల చేస్తున్నాయి. ఇదే కోవలోకి తాజాగా యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 136 పోస్టులను భర్తీ చేయనున్నారు. నిజానికి ఈ నోటిఫికేషన్ కొరకు జూన్ 22న గడువు తేదీ ముగిసినప్పటికీ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అభ్యర్థులకు మరో అవకాశాన్ని ఇచ్చింది.

IHG


తాజాగా ఈ గడువును 2020 ఆగస్టు 10 కి పొడిగించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ లాంటి ఉద్యోగుల్ని భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికార వెబ్ సైట్ లో చూడవచ్చు. ఇక ఈ రిక్రూట్మెంట్ సంబంధించి పూర్తి వివరాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మొత్తం ఖాళీలు 136 ఉండగా... గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ (కెమికల్)- 4, అప్రెంటీస్ (మైనింగ్ మేట్)- 53, అప్రెంటీస్ (ల్యాబరేటరీ అసిస్టెంట్)- 6, మైనింగ్ మేట్ సీ- 52, బాయిలర్ కమ్ కంప్రెషర్ అటెండెంట్- 3 , వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ బీ- 14, బ్లాస్టర్ బీ- 4 గా ఉన్నాయి.

IHG


ఈ ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతలు చూస్తే... వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. త్వరలో వెల్లడించనున్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిర్వహించే ఆన్‌లైన్ ఎగ్జామ్ ద్వారా ఉద్యోగులను భర్తీ చేయనున్నారు. ఇక ఈ ఉద్యోగాలకు వేతనం-రూ.33,994 వరకు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: