తెలంగాణ లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.. కరోనా చికిత్స ఆస్పత్రులన్నీ పూర్తిగా నిండిపోయాయి. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లో బెడ్ లు దొరకలేదని చాలా మంది ఆసుపత్రి బయటే ప్రాణాలను వదులుతున్న పరిస్థితి.. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్యాన్ని మరింతగా బలోపేతం చేయాలని సీఎం
కేసీఆర్ నిర్ణయించారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించేలా 114 వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పలు విభాగాల్లో సిబ్బందిని నియమించాలని
ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఇందుకు సంబంధించన ప్రక్రియ తక్షణమే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. 144 మంది డాక్టర్లు, 527 మంది నర్సు లు, 84 మంది ల్యాబ్ టెక్నీషియన్లు మొత్తం 755 పోస్టులను విడుదల చేశారు..రాష్ట్రంలో ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల్లో ఈ నియామకాలను చేపట్టినట్లు తెలుస్తుంది.ఇంటర్వూ లను నిర్వహించి, అర్హులైన సిబ్బంది నియామకాన్ని ఐదు రోజుల్లో పూర్తి చేయాలని
జిల్లా కలెక్టర్లకు సీఎం
కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్తగా నియమించిన ఈ ఉద్యోగాల వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 9.02 కోట్ల భారం పడనుంది.
తెలంగాణలో వేల సంఖ్యలో కేసులు వస్తుండడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఒకవైపు రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తానని ప్రకటించిన సీఎం.. ఇప్పుడేమో అత్యవసరంగా
ఆక్సిజన్ తెచ్చేందుకు యుద్ధ విమానాలను సైతం వాడారు.కాగా,నాలుగు లక్షల రెమిడిసివర్ ఇంజక్షన్లను తాయారు చేయాలని
మంత్రి కేటీఆర్ ఉత్పత్తి దారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ ఒకవైపు అయితే ప్రస్తుతం రోజువారి రోగులకు సైతం మెరుగైన చికిత్స అందించేందుకు ప్రతీ ఒక్కరి ప్రాణాలను కాపాడేందుకు మరిన్ని చర్యలకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు.. ఇక రోగుల ఆరోగ్య దృష్ట్యా కలెక్టర్లకు పూర్తి రైట్స్ ను ఇచ్చారు.. సీఎం
కేసీఆర్ నిర్ణయం వల్ల ఏ మాత్రం ప్రయోజనాలు ఉంటాయో చూడాలి..