పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధరలు భారీగా తగ్గినట్లు నిపుణులు అంటున్నారు.. నిన్నటి వరకు పరుగులు పెట్టిన పసిడి ధరలకు ఈ రోజు కాస్త బ్రేక్ పడినట్లు తెలుస్తుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు పెరిగే కొద్ది రేట్లు కూడా భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు పెరిగిన బంగారం ధరలకు నేటి మార్కెట్ బ్రేక్ చేసిందని తెలుస్తుంది. ఈ మేరకు ఈరోజు రేట్ల విషయానికొస్తే ఉపశమనం కలుగుతుంది. ఈరోజు బంగారం రేట్లు పూర్తిగా తగ్గడంతో పసిడి ప్రియులు బంగారం షాపుల ముందు క్యూ కడుతున్నారు.



ఇకపోతే రెండు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం .. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టింది.10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.100 తగ్గుదలతో రూ.51,410కు క్షీణించింది. అదే మాదిరిగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.90 తగ్గింది. దీంతో ధర రూ.47,130కు పడిపోయింది. గత కొన్ని రోజులుగా బంగారం ధర పై వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. ఈ మేరకు వెండి ధర కాస్త కిందకు దిగింది .




ప్రస్తుతం స్వదేశీ మార్కెట్ లో వెండి ధరల విషయాన్ని పరిశీలిస్తే..కేజీ వెండి ధర ఏకంగా రూ.1000 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.61,500కు దిగొచ్చింది. దేశ వ్యాప్తంగా వెండి వస్తువుల తయారీ , నాణేల తయారీ వంటి వెండి వస్తువుల తయారీ క్షీణించింది. దీంతో వెండి కి మార్కెట్ లో డిమాండ్ లేదు. మొత్తానికి  బంగారం ధరలు పెరిగితే, వెండి పెరుగుతుంది. తగ్గితే వెండి కూడా తగ్గుతుంది. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి పై ఉన్న వడ్డీ రేట్లు తగ్గడంతో గోల్డ్ రేటు కిందకు దిగింది..బంగారం ధర ఔన్స్‌కు 0.17 శాతం పెరుగుదలతో 1908 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.47 శాతం పెరుగుదలతో 24.53 డాలర్లకు పెరిగింది. మొత్తం మీద ఈ రేట్లు ఈరోజు ప్రజలకు ఊరట నిస్టున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: