ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రతిరోజు ఉదయం లేవగానే కాఫీ,టీ వంటివి తాగుతూ ఉంటారు. కొంతమంది ప్రజలు ఎక్కువగా కాఫీనే తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి కొంతమందికి కాఫీ తాగకుంటే ఏ పని కూడా చేయకుండా ఉంటారు. అయితే కాఫీ తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్న ఎక్కువగా వీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కెఫిన్ అనే పదార్థం కాఫీలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది తాగితే పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు. వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.



కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు కాఫీని అసలు తాగకూడదట. ముఖ్యంగా తిమ్మిర్లు, గుండె సమస్య లతో ఇబ్బంది పడేవారు కాఫీని అసలు తాగకూడదు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు కాఫీలు తాగడం వల్ల బిపి ఒక్కసారిగా పెరిగి అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అలాగే గర్భిణీ స్త్రీలు కూడా కాపీని ఎక్కువగా తాగడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాఫీని ఎక్కువగా తాగితే శరీరంలో ఉండే నీటి శాతం తగ్గిపోయి డిహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఎక్కువగానే ఉంటుందట బాలింతలకు.


కాఫీ తరచు తాగే వారు ఎక్కువగా నిద్రలేని సమస్యలతో బాధపడుతుంటారని వైద్యులు తెలియజేస్తున్నారు. దీనివల్ల విపరీతమైన తలనొప్పి వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అందుచేతనే కాఫీని ఇలాంటివారు ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. అయితే కాపీని తాగడం బదులుగా అల్లం పాలను ప్రతిరోజు ఒక పూట తగినట్లు అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అల్లం లో ఉండే పోషకాలు మొత్తం మన శరీరానికి బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. అధిక బరువుతో ఇబ్బంది పడే వారు కూడా కాఫీని దూరం చేస్తే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: